జయంతి
విషయం : గుర్రం జాషువా జయంతి
సమయం : ఉదయం 8.30 గంటలకు
వేదిక : తుమ్మలపల్లి కళాక్షేత్రం
 
సమావేశం
విషయం : రిజర్వేషన్‌పై సమావేశం
సమయం : ఉదయం 10 గంటలకు
వేదిక : మిడ్‌సిటీ హోటల్‌


సభ
విషయం : ఆలిండియా బ్యాంక్‌ ఉద్యోగుల సభ
సమయం : ఉదయం 10.30 గంటలకు
వేదిక : ధర్నా చౌక్‌


వర్ధంతి
విషయం : భగత్‌సింగ్‌ వర్థంతి
సమయం : ఉదయం 10.30 గంటలకు
వేదిక : దాసరి భవన్‌
 
సెమినార్‌
విషయం : రహదారులు, ఈ చలాన్లపై సెమినార్‌
సమయం : ఉదయం 10.30 గంటలకు
వేదిక : ఎంబీవీకే


రూపకం
సమయం : దేవీ విజయం సంగీత, సాహిత్య రూపకం
సమయం : సాయంత్రం 5.30 గంటలకు
వేదిక : కల్చరల్‌ సెంటర్‌
 
పర్యాటక దినోత్సవం
విషయం : ప్రపంచ పర్యాటక దినోత్సవం
సమయం : సాయంత్రం 5.30 గంటలకు
వేదిక : తుమ్మలపల్లి కళాక్షేత్రం


రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలలోని అన్ని పాఠశాలలకు ఏపీ ప్రభుత్వం దసరా విజయదశమి సెలవులు ప్రకటించింది.
సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 9వ తేదీ వరకూ సెలవులు ఇచ్చింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కళాశాలలకు అక్టోబరు 6 నుంచి 13 వరకూ సెలవులు ప్రకటించింది.


ఏపీ ప్రభుత్వ సలహా దారు(పబ్లిక్‌ పాలసీ)గా డాక్టర్‌ రామచంద్రమూర్తి కొండు భట్లను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది.
నియమ నింబధనలను తదుపరి ఉత్తర్వుల్లో పేర్కొంటామని ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.


శ్రీశైలం : శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి మరింత పెరిగింది. దీంతో ప్రాజెక్టుకు సంబంధించిన 10 గేట్లను అధికారులు ఎత్తివేశారు.
ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 2.12 లక్షలు కాగా.. ఔట్‌ఫ్లో 3.48 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, ప్రస్తుతం 884 అడుగులుగా ఉంది. జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.


విశాఖపట్నం : ఇక్కడి ఏసీఏ వీడీసీఏ స్టేడియం లో అక్టోబరు 2 నుంచి దక్షిణాఫ్రికాతో జరగనున్న తొలి టెస్టులో తలపడే భారత్‌ ఆటగాళ్లు శనివారం నగరానికి రానున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ముంబైనుంచి రహానే, హైదరాబాద్‌ నుంచి గిరీష్‌ దోంగ్రీ, సాయంత్రం 5.30 గంటలకు ఢిల్లీ నుంచి షమిందర్‌ సిద్ధు, విక్రమ్‌ రాహోర్‌, చతేశ్వర పుజారా, రిషబ్‌ పంత్‌, మహ్మద్‌ షమీ, చెన్నై నుంచి అశ్విన్‌ రవిచంద్ర విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం 6.50 గంటలకు హైదరాబాద్‌ నుంచి హనుమాన్‌ విహారి, ఆర్‌. శ్రీధర్‌ వస్తారు. వీరికి నోవాటెల్‌లో బస కల్పిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ముంబై నుంచి వచ్చే విమానంలో టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ నగరానికి చేరుకుంటాడు. మిగిలిన ఆటగాళ్లలో కులదీప్‌ యాదవ్‌, నితిన్‌ పటేల్‌, షబ్నం గిల్‌, సాహా సాయంత్రం నగరానికి చేరుకుంటారు.



మరింత సమాచారం తెలుసుకోండి: