ఇటివల కేంద్రం కొత్తగా తెచ్చిన మోటారు వాహనాల చట్టంలో ట్రాఫిక్ నియమ నిబంధనలను కఠినతరం చేసింది. బారీ జరిమానాలతో తీసుకొచ్చిన ఆ చట్టంతో వాహనదారులు ఇక్కట్లను చూసి కొన్ని రాష్ట్రాలు ఆ జరిమానాలు తగ్గించాయి. కానీ రాష్ట్రాలకు ఆ అధికారం లేదని, కేవలం కొన్ని అంశాల్లో మాత్రమే తగ్గించుకునే వెసులుబాటు కల్పించింది. హెల్మెట్ ధరించకపోయినా, మైనర్లు వాహనాలు నడిపినా, రేసింగ్ లో పాల్గొన్నా తప్పనిసరిగా కేంద్రం విధించిన భారీ జరిమానాలు కట్టాల్సిందే. లైసెన్స్, బీమా లేకపోవడం, మద్యం తాగి డ్రైవింగ్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం.. వంటి అంశాల్లో మాత్రం జరిమానాలు తగ్గించుకునే అవకాశాన్ని రాష్ట్రాలకు కల్పించింది. వీటికి కూడా తనిఖీల్లో భాగంగా మాత్రమే తగ్గింపు ఉంటుంది.. కోర్టు కేసు విచారణకు వెళ్తే మాత్రం చట్ట ప్రకారం జరిమానాలు కట్టాల్సిందే.

 


మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 177 నుంచి 198 వరకూ ఉన్న 31 సెక్షన్లలో చట్టంలో సవరణ తీసుకొచ్చారు. ఇందులో 20 సెక్షన్లకు యథావిధిగా ఉత్తర్వులు అమలు చేయాలని ఆదేశించారు. మిగిలిన 11 సెక్షన్లలో మాత్రమే రాష్ట్రాలకు వెసులుబాటు అధికారం కల్పించారు. వీటిపై ప్రభుత్వం ఓ నివేదిక రూపొందించింది. దీనిపై సీఎం తుది నిర్ణయం తీసుకోనున్నారని రవాణా అధికారులు చెప్తున్నారు.

 


జరిమానాలు తగ్గించేందుకు వీలులేనివి..

సెక్షన్                   

ఉల్లంఘన

పాత జరిమానా     

కొత్త జరిమానా

 

179

ఆదేశాలు పాటించకపోవడం

500

2000

189

రేసింగ్

500

5000

193

లైసెన్స్ లేకపోవడం

-

25వేల నుంచి లక్ష వరకూ

194

ఓవర్ లోడింగ్

2000 లేదా అదనపు టన్నుకు వెయ్యి చొప్పున

20వేలు లేదా అదనపు టన్నుకు 2వేలు చొప్పున

194ఎ

ప్రయాణికుల ఓవర్ లోడింగ్

  •  

అదనపు ప్రయాణికుడికి 1000 చొప్పున

194సి

ద్విచక్ర వాహనాల్లో ఓవర్ లోడింగ్

100

2వేలు, మూడు నెలలపాటు లైసెన్స్ అనర్హత

194డి

హెల్మెట్ లేకపోవడం

100

వెయ్యి, మూడు నెలలపాటు లైసెన్స్ అనర్హత

 194ఇ

అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకపోవడం (కొత్తది)

 

10 వేలు

199

పిల్లల వాహనాలు నడిపితే (కొత్తది)

 

యజమానికి రూ.25వేలు జరిమానా, 3ఏళ్ల జైలు శిక్ష, వాహన రిజిస్ట్రేషన్ రద్దు

 


జరిమానా తగ్గించేందుకు వీలున్నవి...

సెక్షన్

ఉల్లంఘన

పాత జరిమానా

కొత్త జరిమానా

రవాణా శాఖ సవరణ

177ఎ

రోడ్లపై ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించడం

100

500

250

180

అనధికారంగా వాహనాల వినియోగం

1000

5000

2000

181

డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే..

500

5000

2500

182

డ్రైవింగ్ కు అనర్హత

500

10,000

4,000

182బి

ఓవర్ సైజ్ వాహనాలు

-

5,000

1,000

183

ఓవర్ స్పీడింగ్

400

1,000 – 2,000

750

184

ప్రమాదకర డ్రైవింగ్

1,000

5,000

2,500

185

మద్యం తాగి వాహనాలు నడపితే

2,000

10,000

5,000

192ఎ

పర్మిట్ లేని వాహనం

5,000

10,000

6,500

194బి

సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం

100

1,000

500

196

బీమా లేకపోవడం

1,000

2,000

1,250

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: