తెలంగాణ హుజూర్ నగర్ నియోజక వర్గానికి అక్టోబర్ 21 వ తేదీన ఉపఎన్నిక జరగబోతున్నది.  ఈ ఉపఎన్నికల్లో కాంగ్రెస్, తెరాస, బీజేపీలు పోటాపోటీగా పోటీ చేస్తున్నాయి.  విజయం కోసం మూడు పార్టీలు శాయశక్తులా కృషి చేస్తున్నాయి.  హుజూర్ నగర్ నియోజక వర్గంలో మొదట కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి విజయం సాధించాడు.  


అయితే, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అయన ఎంపీగా పోటీ చేసి విజయం సాధించడంతో.. హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజక వర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది.  ఈ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్యను నిలబెట్టారు.  ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నుంచి కూడా అనుమతి వచ్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది.  ఎలాగైనా తిరిగి గెలవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది.  


కాగా, తెరాస పార్టీ కూడా గెలుపుకోసం ప్రయత్నం మొదలు పెట్టింది. బలమైన వ్యక్తిని అక్కడ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టింది.  అంతేకాదు, తెరాస పార్టీకి చెందిన సగం కేడర్ హుజూర్ నగర్ లో ఉంటూ అభ్యర్థి గెలుపుకోసం ప్రచారం చేస్తున్నారు.  హుజూర్ నగర్ నియోజక వర్గాన్ని సొంతం చేసుకోవాలని తెరాస పార్టీ పట్టుదలతో ఉంది.  ప్రతి ఇంటిని వదలకుండా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు.  మంత్రులు కూడా హుజూర్ నగర్లో ప్రచారం చేస్తున్నారు.  


ఇక ఇదిలా ఉంటె, ఈ రెండు పార్టీలతో పాటు బీజేపీ కూడా పోటీలోకి దిగింది.   రెండు పార్టీలు ఓసి అభ్యర్థులను రంగంలోకి దించితే.. బీజేపీ బీసీ అభ్యర్థిని రంగంలోకి దించింది.  అక్కడ బీసీ లు అధికంగా ఉన్నారు.  బీసీల్లో మంచి పేరున్న వైద్యుడు కాటా రామారావును రంగంలోకి దించింది.  తెలంగాణలో పట్టు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ఆదిశగా అడుగులు వేసేందుకు హుజూర్ నగర్ ను లక్ష్యంగా చేసుకున్నది బీజేపీ.  మరి ఈ మూడు పార్టీల్లో ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: