చంద్రాలు.. ఏపీలోనే కాదు దేశంలోనే పేరున్న రాజ‌కీయ నేత‌.. సీనియ‌ర్ సీఎంగా, ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న ప్ర‌జాప్ర‌తినిధి.  రాజ‌కీయాల్లో నాక‌న్నా తోపు ఎవ్వ‌రు లేర‌ని త‌న ట్రాక్ రికార్డును తానే చెప్పుకుంటూ మురిసిపోయే చంద్రాలు.. ఇప్పుడు త‌న ఊస‌రెల్లి నైజాన్ని బ‌య‌ట‌పెట్ట‌బోతున్నాడా... ఓడ ఎక్కేదాక ఓడ‌మ‌ల్ల‌న్న ఓడ ఎక్కినాక బోడీ మ‌ల్ల‌న్న అనే త‌త్వ‌మున్న చంద్రాలు ఇప్పుడు మ‌రోమారు అదే సామేత‌ను నిజం చేయ‌బోతున్నాడా.. న‌మ్మించి త‌డిగుడ్డ‌తో  గొంతు కోయ‌డంతో సిద్ధ‌హ‌స్తుడిగా ముద్ర ఉన్న చంద్రాలు ఇప్పుడు అదే చేయ‌బోతున్నాడా.. అస‌లు చంద్రాలు ఇప్పుడు తీసుకోబోయే నిర్ణ‌యం ఆయ‌న రాజ‌కీయ నైజాన్ని మ‌రోమారు చాటిచెప్ప‌బోతుంది. 


న‌మ్మించి గొంతులు కోస్తాడ‌ని పిల్ల‌నిచ్చిన మామే బ‌హిరంగంగా విమ‌ర్శించింది చంద్రాలు మ‌రిచిపోయినా.. లోకం మాత్రం మ‌రిచిపోలేదు.. స‌రికదా అవస‌ర‌మైన‌ప్పుడల్లా.. లోకం కోడై కూస్తుంది కూడా. అయితే చంద్రాలు త‌న నైజాన్ని మ‌రోమారు చూపేందుకు సిద్ద‌మ‌యిన‌ట్లు రాజ‌కీయాల్లో జోరుగా చ‌ర్చ జ‌రుగుతుంది. ఇంత‌కు విష‌యం ఏంటంటే.. చంద్రాలు గ‌త రాజ‌కీయ చ‌రిత్ర‌లో స్వ‌తంత్రంగా పోటీ చేసి గెలిచింది లేదు. అయితే గ‌త డిసెంబ‌ర్‌లో చంద్రాలు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని మ‌హాకూటమి పేరుతో పోటీ చేశాడు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తో పొత్తుతో పోటీ చేసిన చంద్రాలు దారుణ‌మైన ఓట‌మిని మూట‌గ‌ట్టుకున్నాడు. 


వాస్తవానికి చంద్రాలుతో పొత్తుతో కాంగ్రెస్ త‌గిన మూల్యం చెల్లించుకుంద‌నే చెప్ప‌వ‌చ్చు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్ర‌జ‌ల్లో కాంగ్రెస్‌పై సానుభూతి ఉన్న స‌మ‌యంలో ఆంధ్ర బాబుతో పొత్తు పొట్టుకోవ‌డంతో తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అనుమానాలు మొద‌ల‌య్యాయి. చంద్రాలు తెలంగాణ‌లో ప‌ర్య‌ట‌న చేసి, తెలంగాణ వాదుల‌నే కించ‌ప‌రిచేలా మాట్లాడ‌టంతో తెలంగాణ స‌మాజం భ‌గ్గుమంది.. కాంగ్రెస్ ఓట‌మికి చంద్రాలు కార‌ణ‌మ‌య్యాడు. ఇక 2019లో తెలంగాణ‌లో జ‌రిగిన  పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న చంద్రాలు, అదే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్రం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోలేదు. 


ఒక తెలుగు రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని కులికిన చంద్రాలు, మ‌రో తెలుగు రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్‌తో విడాకులు తీసుకున్నాడు.. అంటే చంద్రాలు నైజం మ‌రోమారు బోధ‌ప‌డింది. అయితే తెలంగాణ‌లో గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పొత్తుతో పోటీ చేసిన చంద్రాలు ఇప్పుడు సూర్యాపేట జిల్లా హుజూర్‌న‌గ‌ర్‌లో జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌లో మాత్రం ఒంట‌రిగా పోటీ చేయాల‌నే ఆలోచ‌న చేస్తున్నాడ‌ట‌. ఇక్క‌డ టీడీపీ అభ్య‌ర్థిని ఆదివారం ప్ర‌క‌టిస్తున్న‌ట్టు ఇప్ప‌టికే చెప్పేశారు. అంటే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే ఆలోచ‌న లేనట్లు తెలుస్తుంది. టీడీపీ  నుంచి హుజూర్‌న‌గ‌ర్‌లో పోటీ చేయించాల‌ని చంద్రాలు కూడా ఆలోచిస్తున్నార‌ట‌.. దీనిని బ‌ట్టి మ‌రోసారి బాబు త‌న నైజం బ‌య‌ట పెట్టుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: