ఇప్పటి వరకు హుజూర్ నగరంలో త్రిముఖ పోటీ ఉంటుంది అనుకున్నారు.  కానీ, ఇప్పుడు చతుర్ముఖ పోటీ ఉండబోతున్నట్టు అర్ధం అవుతున్నది.  ప్రధాన పార్టీలైన తెరాస, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోటీ ఉండేలా ఉన్నది.  ఈ మూడు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారం షురూ చేశాయి.  కాంగ్రెస్, తెరాస లు ఓసి అభ్యర్థులను నిలబెడితే.. బీజేపీ బీసీ అభ్యర్థిని రంగంలోకి దించింది.  ఈ మూడు పార్టీలు గెలుపు మాది అంటే మాది అని చెప్పుకుంటున్నారు.  


ఈ మూడు పార్టీల మధ్యలోకి తెలుగుదేశం పార్టీ కూడా దూరిపోయింది.  తెలుగుదేశం పార్టీ కూడా హుజూర్ నగర్ నియోజక వర్గం నుంచి ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం అయ్యింది.  ఈరోజు పార్టీ అభ్యర్థిని ప్రకటించి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు.  గతంలో తెలుగుదేశం పార్టీకి తెలంగాణాలో మంచి పట్టు ఉంది.  కానీ, 2014 రాష్ట్రం విడిపోయాక తెలంగాణలో పార్టీ పూర్తిగా ఖాళీ అయ్యింది.  కానీ, బాబు మాత్రం తన ఆశలను చంపుకోలేదు.  


తెలంగాణాలో తిరిగి నిలబడాలని ప్రయత్నం చేస్తున్నారు.  ఇందులో భాగంగానే హుజూర్ నగర్ ఉపఎన్నికలు వినియోగించుకోవాలని చూస్తున్నారు. గత ఎన్నికల్లో హుజుర్ నగర్ నుంచి కాంగ్రెస్ విజయం సాధించింది.  ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా కూడా విజయం సాధించడంతో ఆ నియోజక వర్గాన్ని ఉప ఎన్నిక జరగబోతున్నది.  ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని అన్ని పార్టీలు బలంగా కృషి చేస్తున్నాయి.  


ఎలాగైనా హుజూర్ నగర్ లో విజయం సాధించి ఆధిపత్యం కొనసాగించాలని తెరాస చూస్తుంటే.. ఉపఎన్నికలో తిరిగి విజయం సాధించి పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.  అటు బీజేపీ కూడా రాష్ట్రంలో బలపడుతున్నది కాబట్టి హుజూర్ నగర్ జూ ఒక ఛాలెంజ్ గా తీసుకుంది. ఈ పార్టీలతో పాటు తెలంగాణాలో తెలుగుదేశం పార్టీకి తిరిగి పూర్వవైభవం తీసుకురావడంలో భాగంగా చంద్రబాబు నాయుడు హుజూర్ నగర్ ఉప ఎన్నికను వినియోగించుకోబోతున్నారు.  మరి ఈ నాలుగు పార్టీల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది అన్నది తెలియాలంటే అక్టోబర్ 24 వరకు ఆగాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: