వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత తనదైన ముద్రను వేసుకుంటూ పాలన చేస్తున్నాడు.  ఇందులో భాగంగానే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.  కొన్ని కఠినంగా ఉన్నా వాటిని అమలులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.  ఉద్యోగాల కల్పన విషయంలో బాబు అడుగు ముందుకు వేసి అనుకున్న విధంగానే విజయం సాధించారు. పింఛన్ విషయంలో కూడా అలానే చేశారు.  నీటి పారుదల విషయంలో పొరుగురాష్ట్రంతో సఖ్యతగా ఉండాలని అని చెప్పి కెసిఆర్ తో సఖ్యతగా ఉంటూ నీటిని తీసుకొచ్చుకోవడంలో సక్సెస్ అయ్యారు.  


దీంతో పాటుగా ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అనే అంశంలో ముందుకు అడుగువేసి ప్రగతి సాధించాడు.  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు.  అయితే, విలీనం కాకుండా అనేక విషయాల గురించి ఆర్టీసీ యాజమాన్యం ముందుకు వచ్చినా వాటిని పక్కన పెట్టి విలీనం చేయాలని జగన్ నిర్ణయించారు.  ఈ నిర్ణయంతో ఆర్టీసీ కార్మికుల్లో చైతన్యం వచ్చింది.  ఆర్టీసీ కార్మికులు జగన్ కు బ్రహ్మరధం పట్టారు.  


ఈసెగ పక్కరాష్ట్రమైన తెలంగాణకు తగిలింది.  అక్కడి కార్మికులు కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు.  డిమాండ్ నెరవేర్చకుంటే.. సమ్మె చేస్తామని హెచ్చరించారు.  హెచ్చరించినట్టుగానే ఆర్టీసీ కార్మికులు అక్టోబర్ 5 వ తేదీ నుంచి సమ్మెకు దిగుతున్నట్టు ప్రకటించారు.  సమ్మెకు దిగితే అది ప్రభుత్వానికి పెద్ద తలనోప్పిగా మారుతుంది.  అసలే ఇప్పుడు దసరా సీజన్ నడుస్తున్నది.  ఇప్పుడు కార్మికులు సమ్మెకు దిగారు అంటే.. దాని వలన ఆర్టీసీకి బోలెడు లాస్ వస్తుంది.  


అసలే లాసుల్లో ఉన్నది.  ఈ నష్టాలు కొంతవరకు మాఫీ చేసుకోవాలి అంటే ఇలాంటి పండుగ సీజన్లే ఉపయోగపడతాయి.  ఈ సమయంలో సమ్మె అంటే చాలా కష్టం.  ఒకవేళ వారి డిమాండ్ ఒప్పుకొని విలీనం చేస్తే దాని వలన ప్రభుత్వంపై భారీ భారం పడుతుంది.  ఏం చేయాలో తెలియని రీతిలో కెసిఆర్ పడిపోయారు.  ఇప్పుడు విలీనం చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించకూడదు.  ఎందుకంటే ఎన్నికల కోడ్ అడ్డంగా ఉంది.  కాబట్టి కెసిఆర్ దీనికి ఎలాంటి సొల్యూషన్ ఆలోచిస్తారో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: