అనగనగా ఓ దేశం ఆ దేశంలో ఓ దీవి ఆ దీవిలో ఓ హోటల్.. ఆ హోటల్ లో మగపురుషులు అడుగుపెట్టడానికి వీలు లేదు.  ఒకవేళ అనుకోకుండా ఎవరైనా అడుగుపెడితే ఇక అంతే సంగతులు శిక్షలు కఠినంగా ఉంటాయి.  అలా ఎందుకు.. ఆ హోటల్ ప్రత్యేకత ఏంటి.. ఎందుకని ఆ హోటల్ లోకి పురుషులను అనుమతించడం లేదు.. తెలుసుకుందాం. విచిత్రంగా అనిపించినా ఇది నిజం.  ఈ హోటల్ స్పెయిన్ దేశంలో ఉంది.  


స్పెయిన్ దేశంలోని బాలెయారిక్ దీవిలో సోమ్ డోనా అనే పేరుతో ఓ హోటల్ ఉన్నది.  సోమ్ డోనా అంటే మేము మహిళం అనే అర్ధం ఉంది.  అందుకే ఈ హోటల్ లో మహిళలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది.  14 సంవత్సరాలు నిండిన మహిళలు అక్కడ హాయిగా ఉండొచ్చు.  ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  దానికి తగ్గట్టుగానే ఆ హోటల్ నియమాలను రూపొందించింది.  ఆ హోటల్ లో బసచేసే మహిళలకు సంబంధించిన బంధువులు మహిళలైతేనే హోటల్ లోకి అనుమతి ఉంటుంది.  


పురుషులకు మాత్రం నో ఎంట్రీ.  మహిళలకు స్వేచ్ఛ కావాలని అందుకే ఆ హోటల్ లో మహిళలకు మాత్రం ప్రవేశం ఉంటుందని హోటల్ యాజమాన్యం తెలియజేస్తోంది.  అక్కడ విచిత్రం ఏమిటంటే మొదట అక్కడ పనిచేసే ఉద్యోగులను కూడా మహిళలనే నియమించాలని రూల్ పెట్టుకుంది.  కానీ, అక్కడై చట్టాల ప్రకారం ఉద్యోగాల విషయంలో లింగభేదం చూపకూడదు.  దీంతో ఆ హోటల్ లో మహిళలతో పాటుగా పురుషులు కూడా పనిచేస్తుంటారు.  


కాగా, అక్కడ పనిచేసే పురుషులకు చాలా కఠిన నియమాలు ఉంటాయి.  ఆ నియమాలను అతిక్రమించకూడదు.  ఒకవేళ అలా అతిక్రమిస్తే.. దాని వలన అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.  ఉద్యోగం పోగొట్టుకోవాల్సి వస్తుంది.  చుట్టూ అంతమంది మహిళలు ఉన్నప్పుడు ఎందుకు హద్దులు అతిక్రమిస్తాడు చెప్పండి. వాళ్ళను చూస్తూ పనిచేసుకుంటూ పోతాడు.  అంతేకదా మరి.  ఆ హోటల్ లో పనిచేసే అదృష్టం ఎవరికీ వచ్చిందో మరి.  


మరింత సమాచారం తెలుసుకోండి: