నిలోఫర్ ఆస్పత్రిలో జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్ గురించి దుమారం రేగుతోన్న విషయం తెలిసిందే. నిలోఫర్ ఆస్పత్రిలో జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్ పై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఒక కమిటీని ముగ్గురు సభ్యులతో ఏర్పాటు చేసింది. ఈరోజు  కమిటీ విచారణ తరువాత ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. నిలోఫర్ ఆస్పత్రి సూపరిండెంట్ మురళీకృష్ణ నిబంధనల ప్రకారమే ఆస్పత్రిలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నామని చెబుతున్నారు. 
 
కానీ కమిటీ నివేదిక తరువాతే నిజాలు బయటపడే అవకాశం ఉంది. నిలోఫర్ ఆస్పత్రిలో ఏ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయనే విషయాల గురించి కూడా నివేదిక తరువాత స్పష్టత రానుంది. నిలోఫర్ ఆస్పత్రిలో పనిచేసే ఇద్దరు వైద్యుల మధ్య జరిగిన గొడవ కారణంగా ఇలాంటి ఆరోపణలు వచ్చాయని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. నిలోఫర్ ఆస్పత్రిలో క్లినియల్ ట్రయల్స్ కు అనుమతి ఉందో లేదో అనే విషయం తెలియాల్సి ఉంది. 
 
కానీ ఈ ఆస్పత్రిలో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్న మాట మాత్రం వాస్తవమేనని సమాచారం. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు మరికొన్ని టీచింగ్ ఆస్పత్రులలో కూడా క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి ఉంటే మాత్రమే ఆస్పత్రులలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించే అవకాశం ఉంటుంది. ఎథికల్ కమిటీ అనుమతులు ఇచ్చిందని చెప్పి ఆస్పత్రులు క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. 
 
బాలల హక్కుల సంఘం క్లినికల్ ట్రయల్స్ ను ఖండించింది. నిలోఫర్ ఆస్పత్రిలో క్లినికల్ ట్రయల్స్ జరగటాన్ని బాలల హక్కుల సంఘం తప్పని పేర్కొంది. ప్రైవేట్ ఫార్మా కంపెనీలతో కుమ్మక్కై కొందరు డాక్టర్లు అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని బాలల హక్కుల సంఘం ఆరోపణలు చేసింది. బాలల హక్కుల సంఘం బాధ్యులైన డాక్టర్లను సస్పెండ్ చేయాలని కోరింది. క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించిన ఫార్మా కంపెనీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని బాలల హక్కుల సంఘం కోరింది. 


 
 



మరింత సమాచారం తెలుసుకోండి: