వైఎస్ జగన్ పాలన విషయంలో దూసుకుపోతున్నారు.  వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ...అందరికి షాక్ ఇస్తున్నారు.  ఇప్పటికే రికార్డుస్థాయిలో ఉద్యోగాలు కల్పించిన జగన్.. నిరుద్యోగులకు మరో శుభవార్తను తీసుకొస్తున్నారు.  నిరుద్యోగులు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరు వారి లక్ష్యంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.  ఇకపై ప్రతి జనవరిలో వేలాది ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు వెలువడతాయని చెప్పారు.  మరో మూడు నెలల్లో జనవరి రాబోతున్నది.  సో, జనవరి నుంచి భారీ సంఖ్యలో ఉద్యోగాల కల్పన జరగబోతున్నది.  


జనవరి నెలను ఉద్యోగాల కల్పన నెలగా మారుస్తామని జగన్ పేర్కొన్నారు.  ఇప్పటికే రికార్డు స్థాయిలో ఉద్యోగాలు అతి తక్కువ కాలంలోనే నిర్మించినట్టు జగన్ తెలిపారు.  గ్రామవాలంటీర్లకు సంబంధించిన అన్ని విషయాలను ప్రభుత్వం చూసుకుంటుందని, ప్రజలకు సంబందించిన విషయాలను గ్రామవాలంటీర్లు చూసుకోవాలని జగన్ పేర్కొన్నారు.  అంతేకాదు, గ్రామసచివాలయం ఉద్యోగులు అక్టోబర్ 2 నుంచి గ్రామాల్లో, మండలాల్లో అందుబాటులో ఉంటారని ప్రభుత్వం తెలియజేసింది.  


గ్రామాల్లో పాలన వ్యవస్థ వెంటిలేటర్ పై ఉందని, అందుకే గ్రామసచివాలయాలను ఏర్పాటు చేసినట్టు జగన్ పేర్కొన్నారు.  త్వరలోనే మరిన్ని ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధం అయినట్టు పేర్కొన్నారు.  గత ప్రభుత్వాలు ఉద్యోగాలను నిర్లక్ష్యం చేసి.. పనులను ఆలస్యం చేసిందని, మాటలు చెప్పడమే పనిగా పెట్టుకుందని జగన్ పేర్కొన్నారు.  ఇకపై అలాంటి ఇబ్బందులు ఉండవని జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.  


ప్రతి ఒకరు గౌరవంగా బతికే విధంగా ఉద్యోగాల కల్పన చేయబోతున్నట్టు జగన్ పేర్కొన్నారు.  ప్రతి జనవారిలో ప్రత్యేకంగా ఉద్యోగాల ప్రకటనలు వెలువడతాయని జగన్ చెప్పడం విశేషం.  ఎక్కడా కూడా రాజీపడే సమస్య లేదని జగన్ పేర్కొన్నారు.  ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తామని జగన్ చెప్పుకొచ్చారు.  గ్రామసచివాలయాల ద్వారా గ్రామాల్లో అభివృద్ధి సాధ్యం అవుతుందని జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.  దాదాపుగా లక్షా 20వేల మందికి శాశ్వతంగా ప్రభుత్వ ఉద్యోగం కల్పించినట్టు జగన్ పేర్కొన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: