ముఖేష్ అంబానీ వ్యాపార సామ్రాజ్యం గురించి అందరికి తెలిసిందే.
ముఖేష్ అంబానీ ఏ వ్యాపారంలో అడుగుపెట్టినా అది మంచి సక్సెస్ అవుతున్నాడు. సక్సెస్ కు అర్ధం చెప్తున్నాడు. వ్యాపారాన్ని ఎలా మొదలు పెట్టాలి.. ఎలా నడపాలి... ఎలాంటి జిమ్మిక్కులు చేయాలి అని
ముఖేష్ అంబానీ తెలివిగా ఆలోచింది వ్యాపారం చేస్తున్నాడు. ఇక పెళ్లిళ్ల విషయంలో కూడా అలానే ఆలోచించారు.
ముకేశ్ అంబానీ పెద్ద కొడుకు
ఆకాష్ అంబానీకి డైమండ్ వ్యాపారి పిరమల్ కూతురు శ్లోకా మెహతా ను ఇచ్చి వివాహం చేశారు.
ఒక రకంగా చెప్పాలి అంటే ఇది ఒక పెద్ద డీల్ అని చెప్పొచ్చు. వ్యాపారంలో మరో అడుగు ముందుకు వేయాలి అంటే మరో వ్యాపారంలోకి ప్రవేశించాలి అంటే.. దానికి ఆ వ్యాపారంలో అనుభవం ఉన్న వ్యక్తులతో సాన్నిహిత్యం పెట్టుకోవాలి. అప్పుడే విజయం సాధిస్తారు. ఈ విషయం ముకేశ్ అంబానీకి బాగా తెలుసు. కొన్ని నెలల క్రితం
ఆకాష్ అంబానీ వివాహం జరిగింది.
ఆకాష్ అంబానీ, శ్లోక మెహతాలు ప్రేమించుకున్నారు.
శ్లోకా మెహతా,
ముకేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీలు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఆ స్నేహమే ఆ ఇద్దరినీ కలిపింది. ఇదిలా ఉంటె, ఈ ఇద్దరు వివాహం జరిగిన రోజున ఓ చిన్న పార్టీ హంగామా జరిగింది. ఆ మహోత్సవానికి హాజరైన అనేకమంది శ్లోకా,
ఆకాష్ లను ఉద్దేశించి రెచ్చగొట్టడంతో హాలీవుడ్ మూవీ స్టైల్ లో ఆకాష్.. శ్లోకాలను ముద్దు పెట్టుకున్నాడు.
లిప్ టు లిప్ కిస్ చేశాడు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. కిస్ చేయడం.. ఆ తరువాత ఇద్దరు కలిసి డ్యాన్స్ చేశారు. ఈ దృశ్యాలను అక్కడ ఉన్న కొందరు వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే, అప్పట్లో ఈ వీడియోలు బయటకు రాలేదు. రీసెంట్ గా బయటకు రిలీజ్ చేయడంతో ఒక్కసారిగా ఇవి వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.. ఇక ఈ పెళ్ళికి
ఆకాష్ కు శ్లోకా తల్లిదండ్రులు ఓ రాజభావాన్ని కానుకగా ఇచ్చారట.