ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా కరెంట్ కష్టాలు కనిపిస్తున్నాయి.  ఒకవైపు వర్షాలు కురుస్తున్నాయి. గత కొంతకాలంగా వర్షాలు కురుస్తుండటంతో పాపం ఎపిలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  అంతేకాదు.. అటు ఒరిస్సా రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.  ఈ వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తి తగ్గిపోయింది.  ఒడిశా లోని మహానది కోల్ మైన్స్ నుంచి బొగ్గు సరఫరా కావాల్సి ఉంది.  


ఇప్పుడు దానికి సంబంధించిన ఉత్పత్తి సరిగా లేదు.  సింగరేణి మీదనే ఆధారపడి బొగ్గు ఉత్పత్తి జరుగుతున్నది. విండ్, సోలార్ విధ్యుత్ కు సంబంధించిన పీపీఏ లను పక్కన పెట్టడంతో అక్కడ విద్యుత్ ఉత్పత్తి కొంతమేర ఆగిపోయింది.  ఇదే ప్రభుత్వానికి ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నది.  ప్రభుత్వం ఎలాగైనా దీన్ని అధికమించాలని చూస్తున్నది. గంటల తరబడి గ్రామాల్లో కరెంట్ కోతలు విధిస్తున్నారు.  


నిరవధిక కోతలు ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియడం లేదు. ఎప్పుడు కరెంట్ పోతుందో తెలియదు.  ఇది అక్కడి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నది.  ప్రతి రోజు 150 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం ఉండగా కేవలం ధర్మల్ విధ్యుత్ పై మాత్రమే ఆధారపడి విద్యుత్ ఉత్పత్తి చేస్తుండటంతో కోతలు విధించాలి వస్తోంది.  


విండ్, సోలార్ నుంచి వచ్చే ఉత్పత్తి చౌకగా ఉంటుంది.  కానీ, ఎందుకోమరి ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టింది.  పక్కన పెట్టడంతో ప్రభుత్వం ఇప్పుడు ఇరకాటంలో పడిపోయింది.  ప్రతి పక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి.  చిన్న చిన్న పార్టీలు కూడా విమర్శలు చేస్తున్నాయి.  విమర్శల కారణంగా ప్రభుత్వానికి ప్రజల్లో చెడ్డపేరు వస్తున్నది.  కొన్ని మంచి పనులు చేస్తున్న సమయంలో సడెన్ గా ఇలా ఒక్కసారి చెడుపని జరిగితే మచ్చ వస్తుంది.  దాని నుంచి బయటపడానికి అనవసరంగా సమయం వృధా చేయాల్సి వస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: