గత కొంతకాలంగా పాక్ దూకుడు ఎక్కువైంది.  ఇండియాపై ఒంటికాలిపై లేచేందుకు సిద్ధం అయింది.  చైనా, టర్కీ అండ చూసుకొని రెచ్చిపోతున్నది.  ఇండియాపై ఎలాగైనా పైచేయి సాధించి అభివృద్ధి చెందకుండా అడ్డుకోవాలని చూస్తున్నది.  కావాలని ఇండియాపై అభాండాలు వేస్తున్నది.  మొన్న జరిగిన ఐరాస  వేదికపై కూడా పాక్ కాశ్మీర్ విషయం గురించే మాట్లాడింది.  కానీ, దాని గురించి ఎవరూ పట్టించుకోలేదు.  


దీంతో పాక్ పదేపదే యుద్ధం చేస్తామని బెదిరిస్తోంది.  చైనా అండచూసుకొని పాక్ ఇలా మాట్లాడుతుంది అనే సంగతి అందరికి తెలిసిందే.  భారత్ తో యుద్ధం చేస్తే తాము గెలవలేము అనే సంగతి పాక్ కు తెలుసు.  తెలిసి కూడా పదేపదే యుద్ధం అణుయుద్ధం అనే వాదనను  తెరపైకి తీసుకొస్తోంది పాక్.  దీనికి ఇండియా కూడా ధీటుగా  జవాబు ఇస్తున్నది.  ఒకవేళ ఇండియాతో యుద్ధమే కోరుకుంటే తాము సిద్ధంగా ఉన్నామని హెచ్చరించింది.  


పొరుగుదేశంతో సఖ్యతగా ఉండాలన్నది  సిద్ధాంతం అని ఇప్పటి వరకు హెచ్చరిస్తూ వచ్చామని, కానీ అది తప్పు అని తేలిపోయిందని, ఒకవేళ యుద్ధమే కోరుకుంటే దానికి తాము సిద్ధంగా ఉన్నట్టు ఇండియా చెప్పకనే చెప్పింది.  ఇండియన్ ఆర్మీ చీఫ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.  యుద్ధం చేయడానికి మా సైన్యం సిద్ధంగా ఉందని, ఎప్పుడు వెనకడుగు వేసే సమస్య లేదని స్పష్టం చేశారు.  కేంద్రం నుంచి ఆదేశాలు రావడమే తరువాయి అన్నారు.  


పాక్ ఇప్పటికైనా హెచ్చరికలు చేయడం మానేసి, పీవోకే ను ఇండియాకు అప్పగించాలని లేదంటే భవిష్యత్తులోనైనా పీవోకేను తిరిగి తీసుకుంటామని అన్నారు బిపిన్ రావత్.  అటు పాక్ కూడా అంతే దూకుడుగా ఉన్నది.  పదేపదే బోర్డర్ లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నది.  దీనికి ఇండియన్ ఆర్మీ సైతం ధీటుగా జవాబు ఇస్తున్నది. ఇటీవలే ముగ్గురు ఉగ్రవాదులు ఓ ఇంట్లోకి దూరి విధ్వసం సృష్టించాలని చూస్తే దానికి తగిన జవాబు ఇచ్చింది ఇండియా.  


మరింత సమాచారం తెలుసుకోండి: