గత కొన్ని రోజులుగా ఉత్తరాదిని వర్షాలు ముంచెత్తుతున్నాయి.  ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వర్షం భీభత్సంగా కురుస్తున్నది.  ఫలితంగా ఊర్లు చెరువులు ఏకం అయ్యి పొంగి ప్రవహిస్తున్నాయి.  ఈ వర్షాల కారణంగా జనం బెంబేలెత్తిపోతున్నారు.  బీహార్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది.  ఎప్పుడూ లేని విధంగా పాట్నాలో వర్షం దారులంగా కురుస్తోంది.  


అక్కడి ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ తన ఇంటిని కూడా ఖాళీ చేసి వేరే చోటికి పోవాల్సి వచ్చింది.  చాలామంది మంత్రుల ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి.  యూపీలోను దాదాపుగా ఇదే పరిస్థితి వచ్చింది.  యూపీలో కురుస్తున్న వర్షాలకు నాలుగు రోజుల్లో 90 మందికి పైగా మరణించారు.  అంతేకాదు.. మరో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలియడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  ఈ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు పాపం జనాలు నానా రకాలుగా కష్టపడుతున్నారు.  


ఇప్పటికే అనేకమందిని కేంద్రాలకు ప్రజలను తరలించారు.  సహాయక బృందాలు అక్కడ పనిచేస్తున్నాయి.  వీలైనంతగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం  కృషి చేస్తున్నది.  ఇదిలా ఉంటె, ఈ ఉదయం అక్కడి వాతావరణ శాఖ పిడుగులాంటి వార్తను చెప్పింది.  యూపీలోని ఆగ్రా, ఫిరోజాబాద్, ఈట్వాహ్, అరైయా, జాలన్, కన్నౌజ్, కాన్పూర్ దేహత్, కాన్పూర్ నగర్, ఉన్నవో, బిజనూర్ జిల్లాలతోపాటు పరిసర ప్రాంతాల్లో మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం కురుస్తుందని లక్నో వాతావరణకేంద్రం అధికారులు హెచ్చరించారు. రాగల మూడు గంటల్లో యూపీలోని పలు జిల్లాల్లో పిడుగులు పడవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.  


పిడుగులు పడే సమయంలో ప్రజలు బయట ఉండొద్దని, ముఖ్యంగా చెట్ల కిందకు వెళ్లోద్దని హెచ్చరించారు.  ఎందుకంటే పిడుగులు ఎక్కువగా చెట్లపై పడుతుంటాయి.  దానికింద ఉన్న వ్యక్తులు మరణిస్తుంటారు.  కాబట్టి ఈ హెచ్చరికలు జారీ చేశారు.  యూపీలో వర్షాలు కురుస్తుంటాయి మాములే.  కాకపోతే ఈ స్థాయిలో వర్షాలు కురవడం బహుశా ఇదే మొదటిసారి కావొచ్చు.  దేశంలోని ప్రతి రాష్ట్రంలో కూడా ఈ ఏడాది భారీ వర్షాలు కురవడం విశేషం. 


మరింత సమాచారం తెలుసుకోండి: