ఆర్టికల్ 370 రద్దు తరువాత పాక్ ఇండియా దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.  నవాజ్ షరీఫ్ పదవిలో ఉండగా రెండు దేశాల మధ్య సంబంధాలు పునరుద్దరించే విధంగా పనులు జరిగాయి.  కానీ, ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చాక అవి పూర్తిగా దెబ్బతిన్నాయి.  పదేపదే కవ్వించడంతో పాటు, ఇమ్రాన్ చేస్తున్న వ్యాఖ్యలు సైతం అదే విధంగా ఉండటంతో రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయి.  ఇప్పుడు ఈ రెండు దేశాలు శాంతి చర్చలకు సైతం సిద్ధంగా లేవు.  


అయితే, కొన్ని రోజుల క్రితం వాణిజ్యసంబంధమైన ఒప్పందాలను రద్దు చేసుకున్న పాక్, తిరిగి ఆ ఒప్పందాలను తిరిగి పునరుద్ధరించుకుంది.  కారణం ఇండియా నుంచి ఎగుమతులు ఆగిపోతే అక్కడ పరిస్థితులు దారుణంగా ఉంటాయి.  ఇండియా నుంచి ఎగుమతి చేసే నిత్యవసర వస్తువులు లేకపోతె పాక్ పరిస్థితి దారుణంగా మారిపోతుంది.  అందుకే ఇండియాతో ఆ విషయంలో మాత్రం తప్పనిసరిగా రాజీపడుతున్నది.  


ఇదిలా ఉంటె, 1947 వ సంవత్సరం తరువాత పంజాబ్ లోని కొంతభాగం పాకిస్తాన్ లో కలిసిపోయింది.  సిక్కులకు పవిత్రమైన దర్బార్ సాహిబ్ పాక్ భూభాగంలో ఉండిపోయింది. గురునానక్ జయంతి రోజున వేలాదిమంది సిక్కులు దర్బార్ సాహిబ్ సందర్శించుకుంటారు.  పాక్ లో ఉన్న ఆ మందిరాన్ని సందర్బయించుకోవడానికి వ్యయప్రయాసలు పడి అక్కడికి వెళ్తుంటారు. అప్పట్లో జరిగిన ఒప్పందం ప్రకారం పాక్ బోర్డర్ నుంచి దర్బార్ సాహిబ్ వరకు పాక్ రోడ్డు మార్గం నిర్మించాలి.  


ఇటు ఇండియాలోని గురుదాస్ పూర్ జిల్లలో గురునానక్ మందిరం వరకు ఇండియా రోడ్డు మార్గాన్ని నిర్మిస్తుంది.  దీంతో ఎక్కువగా దూరం ప్రయాణం చేయకుండానే ఆ మందిరాన్ని చేరుకోవచ్చు.  కాగా, ఇటీవలే కర్తార్ పూర్ కారిడార్ నడక మార్గాన్ని పూర్తి చేసింది పాకిస్తాన్.  దాన్ని పెద్దఎత్తున ప్రారంభోత్సవం చేయాలని అనుకుంది.  అయితే, ఓపెనింగ్ కు ఇండియా ప్రధాని మోడీని కాదని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఆహ్వానం పంపింది.  దానిని అయన తిరస్కరించారు.  ఒకవేళ పిలిచారు కదా అని వెళ్లి ఉంటె.. పాక్ కుట్రలో భాగంగా కాంగ్రెస్ ను దగ్గర చేసుకోవాలని చూస్తుంది అనే అపవాదు మూటగట్టుకోవాల్సి వచ్చేది.  కాబట్టి ఆయన దాన్ని తిరస్కరించడం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: