ఎంతోమంది ఉన్నత చదువులు చదివినా సరైన ఉద్యోగాలు దొరకక ఇబ్బందులు పడుతున్నారు. నిరుద్యోగులు త్వరగా ఉద్యోగం పొందటానికి కేంద్ర ప్రభుత్వం ఒక చక్కటి అవకాశాన్ని కల్పించింది. నిరుద్యోగులు వారి అర్హతలకు తగిన ఉద్యోగాలను త్వరగా పొందటం కొరకు కేంద్ర ప్రభుత్వం ఒక వెబ్ పోర్టల్ ను ప్రారంభించింది. ఈ పోర్టల్ నిరుద్యోగులకు చాలా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. 
 
కేంద్ర ప్రభుత్వం లేబర్ మరియు ఎంప్లాయిమెంట్ విభాగం ఆధ్వర్యంలో నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ ను ప్రారంభించింది. నిరుద్యోగులు మొదట https://www.ncs.gov.in వెబ్ సైట్ లో  రిజిష్టర్ అవ్వాలి. ఆ తరువాత అర్హతలను నమోదు చేసి అర్హతకు తగిన ఉద్యోగాలను చూసుకొని ఆప్షన్లను సెలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత ఆప్షన్లను పూర్తి చేసి సెక్యూరిటీ కోడ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 
 
వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేసిన తరువాత 19 నంబర్లు గల యూజర్ ఐడీ వస్తుంది. ఆ తరువాత ఈ పోర్టల్ లోకి లాగిన్ అవటం ద్వారా ఉద్యోగాల సమాచారం పూర్తిగా తెలుసుకోవచ్చు. ఈ వెబ్ సైట్ లో ఇప్పటికే చాలా కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వటం కొరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. కోటి మందికి పైగా నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఈ వెబ్ సైట్ లో వివరాలు నమోదు చేసుకున్నారని తెలుస్తోంది. 
 
ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అర్హతలు మరియు పూర్తి వివరాలు ఈ వెబ్ సైట్ లో దొరుకుతాయి. ప్రభుత్వ రంగంలోని ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ రంగంలోని ఉద్యోగాలు కూడా ప్రతిరోజు ఈ వెబ్ సైట్ లో అప్ డేట్ అవుతూ ఉంటాయి. పూర్తి సమాచారం కొరకు ప్రభుత్వం 18004251514 అనే టోల్ ఫ్రీ నంబర్ ను అందుబాటులోకి తెచ్చింది. నిరుద్యోగులకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. ఎంప్లాయిమెంట్ ఎక్ఛెంజ్ నిర్వహించే జాబ్ మేళాల వివరాలు కూడా ఈ వెబ్ సైట్ లో లభిస్తాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: