అక్టోబర్, 1 వ తేదీన  పండుగలు మరియు జాతీయ దినాలు విషయానికి వస్తే.. ఈ రోజు అంతర్జాతీయ శాకాహార దినోత్సవం. ప్రపంచ వృద్ధుల దినోత్సవం కూడా. జాతీయ రక్తదాన దినోత్సవం ఈ రోజే. సైప్రస్, నైజీరియా, తువాలు, పలౌ స్వాతంత్య్ర దినోత్సవం. ప్రపంచ ఆవాస దినోత్సవం. స్వచ్ఛంద రక్తదాన దినం. అంతర్జాతీయ సంగీత దినం. ఇక ఈ రోజు సంగీత ప్రియులకు పండగే పండగ. 


చరిత్రలో ఈ రోజు జరిగిన సంఘటనలను ఒక సారి పరిశీలిద్దాం.  
1869 : ప్రపంచములో తొలిసారిగా పోస్టుకార్డు ను ఆస్ట్రియా దేశంలో విడుదల చేశారు.
1953: కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ.
1958 : భారతదేశంలో "మెట్రిక్ కొలతల పద్ధతి" ప్రవేశపెట్టబడింది.
1982: తొలి CD ప్లేయర్ ను సోని లాంచ్ చేసింది.
1984: బజరంగ్ దళ్ అనేది ఒక హిందూ మత సంస్థ. బజరంగ్ దళ్ స్థాపన.
1997: జనరల్ వి.పి. మాలిక్ భారత దేశము నకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.
2000: జనరల్ ఎస్.ఆర్. పద్మనాభన్ భారత దేశము  నకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.



చరిత్ర పురుషుల జననాలు..
1847: అనీ బెసెంట్, హోంరూల్ ఉద్యమ నేత. (మ.1933)
1862: రఘుపతి వేంకటరత్నం నాయుడు, విద్యావేత్త, సంఘసంస్కర్త. (మ.1939)
1890: అంకితం వెంకట భానోజీరావు, విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం, కింగ్ జార్జి ఆసుపత్రుల నిర్మాణానికి భూమిని దానం చేసిన వితరణశీలి.
1908: గడిలింగన్న గౌడ్, కర్నూలు నియోజకవర్గపు  భారతదేశ పార్లమెంటు సభ్యుడు. (మ.1974)
1915: కళాధర్, చిత్ర కళా దర్శకుడు. (మ.2013)
1921: తిక్కవరపు వెంకట రమణారెడ్డి, ప్రముఖ హాస్య నటుడు. (మ.1974)
1922: అల్లు రామలింగయ్య, ప్రముఖ హాస్య నటుడు. (మ.2004)
1928 : సుప్రసిద్ధ దక్షిణ భారత సినిమా నటుడు శివాజీ గణేశన్ జననం (మ.2001).
1934: భువన్ చంద్ర ఖండూరి, భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకుడు మరియు ప్రస్తుత ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి.
1934: చేకూరి రామారావు, తెలుగు సాహిత్య ప్రపంచానికి విమర్శకులు, ప్రముఖ భాషా శాస్త్రవేత్త. (మ.2014)
1939: ఎల్కోటి ఎల్లారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి. (మ.2015)
1942: బోయ జంగయ్య, ప్రముఖ రచయిత. (మ.2016)
1951: జి.ఎం.సి.బాలయోగి, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు మరియు తొలి దళిత లోక్‌సభ స్పీకర్. (మ.2002)
1961: నిమ్మగడ్డ ప్రసాద్, ఫార్మా మాట్రిక్స్‌ ఫార్మా సంస్థ అధిపతి, వాన్‌పిక్‌ నిర్మాణ కాంట్రాక్టర్, వ్యాపారవేత్త.మాట్రిక్స్‌ ప్రసాద్‌ అంటారు. ఓ ప్రసార మాధ్యమానికి కూడా ఆయన భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. 
1901: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రతాప్ సింగ్ ఖైరాన్.



చరిత్రలో ఇదే రోజున అశువులుబాసినా వారిని కూడా ఈ సందర్బంగా స్మరించుకుందాం..  
1939: వెన్నెలకంటి సుబ్బారావు, ఆంగ్లంలో తొలి స్వీయచరిత్ర కర్త. (జ.1784)
1946: గూడవల్లి రామబ్రహ్మం, ప్రఖ్యాత సినిమా దర్శకులు మరియు సంపాదకులు. (జ.1902)
1975: ఆదుర్తి సుబ్బారావు, తెలుగు సినిమా దర్శకులు, నిర్మాత, రచయిత. (జ.1912)
1979: పి.వి.రాజమన్నార్, న్యాయవాది, పండితుడు, భారత రాజకీయనాయకుడు. (జ.1901).


మరింత సమాచారం తెలుసుకోండి: