ప్రపంచంలోనే ఈ తరహా రాడార్‌ నౌకను కలిగి ఉన్న దేశాల్లో భారత్‌ ఐదవది కావడం విశేషం. ఇండియన్‌ నావీకి క్లాసిఫైడ్‌ (అత్యంత రహసమైనది)గా ఈ నౌక కానుంది. దీని నిర్మాణం విషయంలో పలు మోడిఫికేషన్లు, డిజైన్ల మార్పు వంటివి ఏళ్ల తరబడి చోటు చేసుకుంటున్నాయి. తాజాగా భారత నావికాదళ అమ్ముల పొదిలోకి ఈ భారీ నౌక త్వరలో వచ్చి చేరనుంది. దాదాపు 2011వ సంవత్సరం నుంచి ఎనిమిదేళ్లకుపైగా విశాఖపట్నం హిందుస్థాన్‌ షిప్‌యార్డులోనే దీని నిర్మాణం సాగింది. దేశంలో ఏ షిప్‌యార్డు కూడా ఇంత తక్కువ వ్యవధిలో వెస్సెల్స్‌ను అందజేయలేదని సమాచారం. భవిష్యత్తు అవసరాలు (లాజిస్టిక్స్‌) కోసం ఐదు ఫ్లీట్‌ సపోర్టు సిప్స్‌ (ఎఫ్‌ఎస్‌ఎస్‌)లను కూడా షిప్‌యార్డు తయారు చేస్తోంది. దేశంలో తొలి నౌకా నిర్మాణ కేంద్రం (విశాఖ షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌) హిందుస్థాన్‌ షిప్‌యార్డు లిమిటెడ్‌ (హెచ్‌ఎస్‌ఎల్‌) అత్యంత ప్రతిష్టాత్మకమైన 11184 సర్వేలెన్స్‌ రాడార్‌ నౌకను సిద్ధం చేసింది.


అనేక అవాంతరాలను దాటుకుంటూ 2019 సంవత్సరం నాటికి నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. ప్రస్తుతం షిప్‌యార్డులోనే ట్రయల్‌ రన్స్‌ జరుగుతున్నట్లు సమాచారం. 11184గా పిలవబడే రాడార్‌ సర్వేలెన్స్‌ భారీ షిప్‌ ప్రపంచంలోని అమెరికా, చైనా, రష్యా, ఫ్రాన్స్‌ దేశాలకే ఇప్పటివరకూ ఉంది. ఆయా దేశాల సముద్ర జలాల్లో శత్రునౌకల, క్షిపణుల రాకపోకల సమాచారాన్ని రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా గుర్తించగల సత్తా ఈ నౌకకు ఉంది. ఈ నౌక నిర్మాణంలో షిప్‌యార్డు ఏళ్ల తరబడి నిమగమైంది. గతంలో రూ.1,100 కోట్ల అంచనా వ్యయంతో ఇది మొదలై నేడు రూ.1,500 కోట్ల అంచనాలకు చేరింది. ఈ నౌక సముద్ర అంతర్భాగంలోనూ, ఉపరితలంపైనా ప్రయాణం చేయగల సత్తాతో రూపుదిద్దుకుంది. త్వరలోనే దీన్ని భారత నావికాదళంలోకి ప్రవేశపెట్టేందుకు షిప్‌యార్డు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.



ఈ ప్రాజెక్టు కోసం అదానీతో కలిసి పని చేయడంగానీ, పోటీ ఇవ్వడంగానీ షిప్‌యార్డు చేయనున్నట్లు సమాచారం. రక్షణ రంగ ప్రయోజనాలు, షిప్‌యార్డు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేంద్రం హెచ్‌ఎస్‌ఎల్‌కే దీన్ని ఇచ్చినా చేయగల సత్తా నౌకానిర్మాణ కేంద్రానికి ఉందని ఉన్నతాధికారులు గట్టిగా చెబుతున్నారు. గడచిన నాలుగేళ్లలో 15 నౌకలను భారత నావికాదళానికి హిందుస్థాన్‌ షిప్‌యార్డు అందజేసింది. అదే సమయంలో 37 నౌకలను రిపేరు చేసి 15 నౌకలను అందజేసింది. అత్యంత భారీ ప్రాజెక్టు అయిన పి 75 ఇండియా ఆరు సబ్‌మెరైన్ల కాంట్రాక్టు దాదాపు రూ.45 వేల కోట్ల విలువైనది. నామినేషన్‌ పద్ధతిలో హిందుస్థాన్‌ షిప్‌యార్డుకే దక్కాల్సి ఉన్నా, తాజాగా అదానీ కంపెనీ పోటీ పడుతున్నట్టు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: