పాక్ అంతర్జాతీయంగా తప్పులు చేస్తూ ఆ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మరొక తప్పు చేస్తూ .. ఇలా ఒకదాని తరువాత మరొకటిగా తప్పులు చేస్తున్న పాక్.. అదే రేంజ్ లో అంతర్జాతీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.  అసలే అంతర్గతంగా అనేక సమస్యలు.. ఆ సమస్యలు చాలవన్నట్టుగా కాశ్మీర్ విషయంలో జోక్యం చేసుకుంటూ ఇండియాను పదేపదే రెచ్చగొడుతోంది.  ఇలా రెచ్చగొట్టినంత మాత్రానా ఇండియాకు ఏమైనా కలిసొస్తుందా అంటే శూన్యం అని చెప్పాలి.  


ఇదిలా ఉంటె అంతర్జాతీయంగా ఇప్పుడు ఆ దేశానికీ మరో ఎదురుదెబ్బ తగిలింది.  దేశానికీ స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో హైదరాబాద్ సంస్థానానికి చెందిన నవాబులు మిలియన్ పౌండ్లను ఇంగ్లాండ్ కు పంపించారు.  అప్పట్లో ఇంగ్లాండ్ లో పాక్ రాయబారిగా ఉన్న రహంతుల్లాపై నమ్మకంతో సురక్షితంగా ఉంటుందని పంపించారు.  రహంతుల్లా ఆ డబ్బు గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు.  తనపై నమ్మకంతో సురక్షితంగా ఉంటుందని చెప్పి తనదగ్గర ఆ డబ్బును ఉంచారని చెప్పారు.  


అయితే, 1948లో హైదరాబాద్ సంస్థానం ఇండియాలో విలీనం అయ్యింది.  ఆ సమయంలో ఏడో నిజాం ప్రభువు ఆ డబ్బును తను పంపలేదని తన పేరుతో ఎవరో పంపారని అన్నారు.  పాక్ మాత్రం ఆ డబ్బు తమకే చెందాలని, నిజాం ప్రభువులకు తాము ఆయుధాలు పంపామని చెప్పారు.  కాగా, గత 70 సంవత్సరాలుగా ఆ మిలియన్ పౌండ్ల సొమ్ము లండన్ లోని ఓ బ్యాంక్ లో ఉన్నది.  


గత 70 ఏళ్లుగా ఆ సొమ్ము కోసం పాక్ పోరాటం చేస్తున్నది.  అటు నిజాం వారసులు కూడా పోరాటం చేశారు. నిజాం వారసులకు భారత్ సహాయ సహకారాలు అందించింది.  కాగా, 70 ఏళ్ల సుదీర్ఘమైన విచారణ తరువాత కోర్టు తీర్పు ఇచ్చింది.  ఆ సొమ్ము భారత్ కు చెందుతుందని తీర్పు ఇచ్చింది.  అప్పట్లో మిలియన్ పౌండ్లుగా ఉన్న ఆ సొమ్ము ఇప్పుడు 35 మిలియన్ పౌండ్లుగా మారింది.  అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 306 కోట్లు.  నిజాం వారసులు భారత్ చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలియజేశారు.  ఇది పాక్ అవమానం అని చెప్పాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: