ఇక మన దేశంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు ఉద్దేశపూర్వకంగా చేసినా....అనుకోకుండా చేసిన  పొరపాటు వల్ల గ్రహపాటుగా మారుతుంది కొన్ని సమయాలలో!. చిక్కుల్లో కూడా  పడేస్తుంది!! ఇక రాజకీయాల్లో ఉన్నవారు మాత్రం చాల ఇబ్బందికరంగా ప్రవర్తిస్తే...వారిని ప్రత్యర్థులు సహజంగానే  బాగా  ఆడుకుంటారు. ఉత్తరాఖండ్ లోని రుద్రాపూర్ బీజేపీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ తుక్రాల్ ఇలాంటి  ఊహించని రీతిలో వివాదంలో ఉన్నారు.ఇక దసరా ఉత్సవాల నేపథ్యంలో వేసిన రామ్ లీలా నాటకంలో భాగంగా సీతాదేవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే. `సీతా మేరీ జాన్` అని వ్యాకించినందుకు చికులలో పడ్డారు.

ప్రతి సంవత్సరం సీతారాముల గొప్పతనం నేటి తరానికే తెలియజేసేందుకు దసరాను పురస్కరించుకొని ఉత్తర భారతదేశంలోని అన్ని గ్రామాల్లోనూ దాదాపు రామ్ లీలా నాటకం వేస్తారు . ఈ నేపథ్యంలోనే ..రుద్రాపూర్ నియోజకవర్గంలో రామ్ లీలా నాటకం చేశారు. ఇందులో బీజేపీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ తుక్రాల్ రావణాసురుడి అనే పాత్ర వేశారు. పాత్రదారుల మధ్య సంభాషణల్లో భాగంగా - సీతాదేవి- రావణునికి మధ్య వచ్చే సన్నివేశంలో బీజేపీ ఎమ్మెల్యే నోరుజారారు.

 సీతా మేరీ జాన్’ అంటూ సీతాదేవిని బీజేపీ ఎమ్మెల్యే సంభోదించారు. దీంతో నాటకం జరుగుతున్న చోట కలకలం రేగింది అందరి మధ్య. కొందరు నవ్వగా...మరికొందరు అభ్యంతరం కూడా చెప్పారు. ఈ కలకలాన్ని గమనించిన నిర్వాహకులు ఎమ్మెల్యేగారి మాటలకు అడ్డుచెప్పారు. అయినప్పటికీ...ఆయన అలాగే సంబోదినచడం మానలేదు.గత ఆదివారం జరిగిన ఈ ఉదంతం సోషల్ మీడియాలో సహజంగానే చాల పెద్ద  వైరల్ అయింది. ఎమ్మెల్యే తీరుపై నెటిజన్లు చాల మండిపడుతున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ సైతం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నం కూడా చేస్తుంది.

రావణుడు కూడా సీతమ్మను ఎప్పడూ ‘ సీతా దేవి’  అని సంభోదించేవాడని - కానీ తాజాగా ఎమ్మెల్యే వ్యవహారశైలితో ఆయనకు సీతమ్మపై ఉన్న గౌరవం స్పష్టమైందని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు సూర్యకాంత్  మండిపడ్డారు  రాజ్ కుమార్ మీద. బీజేపీ నేత క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే బీజేపీ ఎమ్మెల్యే మాత్రం తన వైఖరిని సమర్థించుకున్నారు. అక్కడ మాట్లాడింది కేవలం రావణాసుర పాత్రదారేగానే  తప్ప రాజ్ కుమార్ కాదని గమనించాలని అని కోరారు. పైగా తాను సీతాదేవిని ‘మేరీ జాన్’ అని నాటకంలో భాగంగానే సంభోదించానే తప్ప వేరే ఉద్దేశంతో కాదని...దీనిని రాజకీయం చేయవద్దని   రాజ్ కుమార్  విజ్ఞప్తి కూడా చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: