పని ఒత్తిడిలో పడి తెలియకుండా గంటల తరబడి కూర్చొని వర్క్ చేస్తుంటారు.  అలా గంటల తరబడి కూర్చొని పనిచేయడం చాలా డేంజర్ అనే విషయం వాళ్లకు తెలుసు. కానీ, పని ఒత్తిడి కారణంగా ఒక్కోసారి తప్పడం లేదు.  అదే ఖాలీగా సీట్లో కూర్చోమంటే అసలు కూర్చోలేరు.  అందుకే ప్రయాణం చేసే సమయంలో తెలియకుండానే లేచి టాయిలెట్ కు వెళ్తుంటారు.  వెళ్లాల్సి వస్తుంది కూడా.  


ఎవరైనా సరే మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వచ్చినపుడు ఎంతసేపు ఆపుకోగలరు చెప్పండి. చాలా కష్టం కదా.  మూత్ర విసర్జనకు వెళ్ళవలసి వచ్చినపుడు తప్పకుండా వెళ్ళాలి.  అలా కూర్చుంటే చాలా డేంజర్ కూడా.  ప్రయాణం చేసే సమయంలో అయితే ఇంకా డేంజర్.  విమానాల్లో ప్రయాణించే సమయంలో ఇది మరింత ఎక్కువుగా ఉంటుంది.  విమానంలో ప్రయాణించే ఓ మహిళా టాయిలెట్ కు వెళ్ళాలి అంటే ఆమెను వెళ్లనివ్వలేదు.  


అలా అరగంట గంట కాదు ఏకంగా ఏడు గంటలపాటు ఆమెను బలవంతగా సీటులో కూర్చోపెట్టారు.  చివరకు ఆ మహిళలు తాను కూర్చున్న సీట్లోనే మూత్ర విసర్జన చేసింది.  ఈ సంఘటన ఎయిర్ కెనడా లో జరిగింది.  గత నెలలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.  అసలు విషయంలోకి వెళ్తే.. కొలంబియా నుంచి ఐర్లాండ్ లోని డబ్లిన్ కు వెళ్లేందుకు 26 ఏళ్ల మహిళా ఎయిర్ కెనడా ఫ్లైట్ ఎక్కింది.  సాంకేతిక్ లోపం కారణమా రెండు గంటలు ఆలస్యం అయ్యింది. 


అదే సమయంలో ఆమెకు టాయిలెట్ వచ్చింది.  మూత్ర విసర్జనకు వెళ్లాలని చెప్పింది.  కానీ, సిబ్బంది ఆమెను టాయిలెట్ కు వెళ్లనివ్వలేదు.  ఎన్నిసార్లు లేచి వెళ్లినా లోపలి వెళ్లనివ్వలేదట.  ఇక ఆపుకోలేక సీట్లోనే మూత్ర విసర్జన చేసేసింది. అయినా సరే ఆ మహిళను అదే సీట్లో అలానే కూర్చోపెట్టారు..  డెస్టినేషన్ కు చేరుకున్నాక సదరు మహిళా హోటల్ కు వెళ్లి స్నానం చేసి.. ఎయిర్ పోర్ట్ కు వచ్చి ఎయిర్ కెనడాలో తనకు జరిగిన అవమానం గురించి సిబ్బంది పెట్టిన ఇబ్బంది గురించి కంప్లైట్ చేసింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: