భారతదేశంలో నెలకొన్నపరిస్థితులను చూస్తుంటే  జర్మనీలోని నాజీల కాలంలో చోటుచేసుకున్న సంగతులు గుర్తుకు తెస్తున్నాయని  ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షులు, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ వ్యాఖ్యానించారు. ప్రజల వైపు నుంచి తమ సమస్యలను  పరిష్కరించే పాలన ఇమ్మని ఒత్తిడి పెరుగుతుంది. అంటే ఉద్యోగాలు కల్పించమనీ, రైతుల నిస్సహాయ స్థితిని మెరుగుపరచమనీ, శిశు పౌష్టికాహార లోపాన్ని తగ్గించమనీ, మంచి ఆరోగ్య సేవలు అందించమనీ, నాణ్యమైన విద్య అందించమనీ, వగైరా ఆకాంక్షలు పెరుగుతాయి. కాని ఈ పాలకులకు ఆ పరిష్కారాలు ఎలా సాధించాలో తెలియదన్నారు. అంతే కాదు, పరిష్కరించకపోవడం మాత్రమే కాదు, దేశంలో ప్రస్తుతం ఆర్థిక స్థితి మరింతగా దిగజారిందన్నారు.



జాతీయాదాయ పెరుగుదల రేటు ఒక్కసారిగా 5 శాతానికి పడిపోయిందని చెప్పారు. వాహనాల తయారీ రంగంతో సహా పారిశ్రామిక ఉత్పత్తులలో, రియల్ ఎస్టేట్ లో, విద్యుచ్చక్తి రంగంలో, అటువంటి మరెన్నో రంగాలలో పతనం కనబడుతున్నదన్నారు. మున్నన్నడూ లేనంత నిరుద్యోగం తలెత్తడం మాత్రమే కాదు, అది ఇంకా పెరుగుతున్నదని కట్టూ ఆందోళన వ్యక్తం చేశారు.  భారతీయ జనతా పార్టీ 2014లో అధికారానికి వచ్చినప్పటి నుంచి భారతీయ మైనారిటీలకు వ్యతిరేకంగా భారీ మతోన్మాద ప్రచారానికి తెరలేపింది. పాకిస్తాన్ లోని బాలాకోట్ మీద వైమానిక దాడి, సానుకూలమైన భారత ప్రచార సాధనాల ద్వారా యుద్ధోన్మాదాన్ని రెచ్చగొట్టడం కూడ ఈ దండయాత్రలో భాగమే. ఈ ప్రయత్నమంతా ఇటీవలి పార్లమెంటరీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి కనీవినీ ఎరగని ఘన విజయం చేకూర్చడం ద్వారా అనుకున్న ఫలితాలను సాధించింది.



భారతదేశంలోని ఏ ఒక్క సమస్యనూ పరిష్కరించలేని గారడీ చర్యగా అధికరణం 370 రద్దు, దుష్ట పాకిస్తాన్ మీద సాధించిన మహా విజయంగా, ఉత్సవ సందర్భంగా చాలా మంది హిందువులను మరింత ఉన్మాదులుగా మార్చింది. అమెరికాలోని హ్యూస్టన్ లో హౌడీ మోడీ ప్రదర్శన దీనికి ఒక సాక్ష్యం. కనీ వినీ ఎరగని స్థాయి నిరుద్యోగం, దారుణమైన శిశు పోషకాహార లోపం, అతి పెద్ద సంఖ్యలో రైతుల ఆత్మహత్యలు, అశేష ప్రజానీకానికి దాదాపుగా అందని సరైన ఆరోగ్య సౌకర్యాలు, నాణ్యమైన విద్యా సౌకర్యాలు, ధనికులకూ పేదలకూ మధ్య విపరీతంగా పెరిగిపోతున్న అంతరం. నాజీ జర్మనీకీ భాజపా భారత్ కూ పోలికలు చూపుతూ సరిగ్గా జర్మనీలో జరిగినట్టుగానే, అసలు సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారని అంటున్నారు జస్టిస్ మార్కండేయ కట్జూ.



మరింత సమాచారం తెలుసుకోండి: