ఏపీలో ఎప్పుడు  దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ఏ ఒక్క చిన్న విషయం అయినా కూడా పెద్ద వైరల్ గానే మారిపోతోంది. ఇటు అధికార వైసీపీతో పాటు విపక్ష  పార్టీ  ఐనా టీడీపీ - ఈ రెండు పక్షాలకూ అర్హత సాదించని గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ - సింగిల్ సీటుకే సరిపెట్టుకున్న జనసేన... ఇలా అన్ని పార్టీల వ్యవహారాలు, ఏ పార్టీ ఇనాసరే  వైరల్ గా మారిపోతుంది. ఇలాంటి  నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత మరియు  మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ పరారీలో ఉన్నారన్న వార్తలు మరింత ఆసక్తి కరంగా మరి పోయుయింది. 

ఇక  పరారీలో ఉన్నారన్న వార్తలు వివరాలు ఏమిటి అంటే నోరు విపితే.. తనదైన వివాదాస్పద వ్యాఖ్యలకు ఏకైక వ్యక్తి గా నిలుస్తున్న హర్ష కుమార్. ఇటీవల జరిగిన తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నదిలో బోల్తా పడిన బోటు విషయానికి  సంబంధించి   ఆసక్తికరమైన వ్యాఖ్యలే కాకుండా సంచలనాత్మక వ్యాఖ్యలు చేసిన సంగతి  అందరికితెలిసిందే.

బోటు ప్రమాదం జరిగిన దాని గురించి తర్వాత వారం రోజుల పాటు అసలేమాత్రం స్పందించన హర్షకుమార్... వారంరోజుల  తర్వాత ఎంట్రీ ఇచ్చి సంచలన కామెంట్లు చేశారు.బోటు ప్రమాదానికి జగన్ సర్కారే బాధ్యత వహించాలని తనదైన శైలితో  వ్యాఖ్యలు చేసిన హర్షకుమార్.. బోటు ప్రమాదం కారకులను కూడా ప్రభుత్వం రక్షిస్తోందని - ముందుగా జిల్లా ఎస్పీపై కేసు నమోదు చేసి విచారణ చేస్తే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని సంచలన కామెంట్లు కూడా చేశారు.

  హర్ష కుమార్ చేసిన  వ్యాఖ్యలు  చాల కలకలం రేపాయనే చెప్పాలి నిజానికి. బోటు ప్రమాదానికి కారకుడిగా నిలిచిన పోర్టు అధికారి ధర్మశాస్త్ర అనే అధికారిని ప్రభుత్వం రక్షిస్తోందని - ఆయనను రక్షించే వ్యవహారంలో జిల్లా ఎస్పీ అత్యుత్సాహం చేస్తున్నారు అని, తక్షణమే ఎస్పీపై కేసు నమోదు చేయాలని హర్షకుమార్ డిమాండ్ కూడా  చేశారు. అంతేకాకుండా బోటును వెలికి తీసేందుకు అవకాశం ఉన్నా కూడా జగన్ సర్కారు... అందుకు సిద్ధంగా లేదని కూడా చాల ఆరోపణలు చేశాడు. ఇలా రెండు రోజుల పాటు హర్షకుమార్ వ్యాఖ్యలను అంతగా పట్టించుకోని పోలీసులు.. హర్షకుమార్ స్వరం మరింతగా పెరిగేసరికి రంగంలోకి దిగేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: