భారతీయ జనతా పార్టీ ఆంద్ర ప్రదేశ్ లో పాగా వేసేందుకు చాపకింద నీరు చందంగా ఒడివడిగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంపై  తమ వైఖరిని స్పష్ట చేసింది. ఆ కారణంలోనే జగన్ పాలనా తీరును ఎండకాడుతూ వస్తున్నారు. ఈ చర్య లో భాగంగానే రాష్ట్రలో పార్టీని పటిష్టపరిచేందుకు సమాయత్తమైంది. ఈ క్రమంలో ఆకర్ష కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది. ఇప్పటికే తెలుగు దేశం పార్టీ కి చెందిన కీలకమైన నేతలు కమలం దండులో చేరిపోయారు. దాంతో  బీజేపీలోకి కొనసాగుతున్న వలసల పర్వం.  అదే బాటలో మరికొందరు తెలుగు తమ్ముళ్లు కూడా పయనిస్తున్నారు.






తాజగా రాస్తారని చెందిన టీడీపీ , జనసేన , కాంగ్రెస్ నాయకులు  పెద్ద సంఖ్యలో బీజేపీ లో చేరేందుకు సిద్ధమయ్యారు. రామినేని ఫండేషన్ నిర్వాహకులతో పాటుగా  టీడీపీ మాజీ మంత్రి  శానకాయల అరుణ ఆధ్వర్యంలో నేతలు హస్తినకు చేరుకున్నారు.ఇటీవలే పార్టీ ఫిరాయించిన భాజపా నేత సుజనాచౌదరి నేతృత్వంలో వీరంతా ఢిల్లీ చేరుకున్నారు. ముందుగా బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తో సమావేశమయ్యారు. అనంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డా ఆధ్వర్యంలో బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు.



కమలం దళంలో చేరిన పలు పార్టీలకు చెందిన నేతలు వేరే... శనక్కాయల అరుణ (మాజీ మంత్రి, టీడీపీ), వాకాటి నారాయణరెడ్డి (మాజీ మంత్రి, ఎమ్మెల్సీ - టీడీపీ), చింతల పార్థసారథి (జనసేన), పాతూరి నాగభూషణం (మాజీ జెడ్పీ చైర్మన్), నక్కా బాలయోగి (హైకోర్టు మాజీ న్యాయమూర్తి), తోట నాగేష్ (టీడీపీ), రామినేని ధర్మ ప్రచారం (ఎన్ఆర్ఐ - రామినేని ఫౌండేషన్), గట్టి చిన్న సత్యనారాయణ (టిడిపి నేత), బొబ్బిలి శ్రీనివాస రావు (కాంగ్రెస్ నేత,పూతల పట్టు)లు ఉన్నారు.  ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర పదాధికారులు కన్నా లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: