రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న ఇసుక కొరతను  కళ్లెం వేసే ప్రయత్నంలో ఉన్న జగన్ మీద బురద జల్లేందుకు తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియా అనే  ఆయుధంగా ఉపయోగించటం అన్నది అందరికి తెలిసిందే .. దీనికి చెక్ పెట్టేలా జగన్ స్వయంగా రంగంలోకి దిగారు.నూతన ఇసుక విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఇసుక కొరత మరింత  తీవ్రమైంది.
ఈ ఏడాది సెప్టెంబర్ 5న ప్రభుత్వ కొత్త పాలసీ అమల్లోకి వచ్చింది. ఇక సమస్య తీవ్రమవడంతో భవన నిర్మాణాలు ఎక్కడికక్కడ నిర్మాణాలు నిలిచిపోయాయి. ఇలా భావన నిర్మాణాలు నిలిచిపోవడంతో భవన నిర్మాణ కార్మికులు, అనుబంధ రంగాల కార్మికులు పనుల్లేక చాల నష్టపోయారు. ఇసుక కొరత ఇలాగే కొనసాగితే ప్రభుత్వంపై వ్యతిరేకత తప్పదని గ్రహించిన ప్రభుత్వం తక్షణ దిద్దుబాటు చర్యలు చేసేలాగా నిర్ణయం తీసుకుంది.

ఇది ఇలా ఉండగా  రాష్ట్రంలోని అన్ని ఇసుక రీచ్‌లను తక్షణమే తెరవాలని సీఎం వైఎస్ జగన్ అధికారులకు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా ఇసుక కొరత ఉండడానికి వీల్లేదని, రెండు నెలల్లో ఇలాంటి పరిస్థితిలో మార్పు రావాలని తెలిపారు. రీచ్‌ల నుంచి ఇసుక సరఫరా, రవాణా బాధ్యతలను జిల్లాల్లో జేసీ స్థాయి అధికారికి అప్పగించారు. ఆ అధికారి కేవలం ఇసుక సరఫరా, రవాణాలను మాత్రమే చూడాలని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా జరగకుండా కలెక్టర్లు, ఎస్పీలు ఎప్పటికిప్పుడు చర్యలు తీసుకోవలసిందిగా తెలిపారు జగన్. ఈ విషయంలో అధికారుల అందరికి  పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని జగన్ స్పష్టం చేశారు.

ఇక  రాష్ట్రంలో వరదలు కూడా తగ్గడంతో ఇసుక లభ్యత ఉంటుందని, ప్రజలకు తక్కువ రేట్లకు ఇసుకను అందజేయాలని జగన్ తెలియచేసారు. రవాణా విషయంలో రాజకీయ జోక్యాన్ని తగ్గించాలి అని తెలిపారు సీఎం.నిరుద్యోగ యువతకు అవకాశం ఇవ్వాలి అనే ఆలోచనతో ఇసుక రవాణాలో నిరుద్యోగ యువతను భాగస్వామ్యులను చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రతి జిల్లాలో 2 వేల మంది నిరుద్యోగులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు యువకులకు ఆయా కార్పొరేషన్ల ద్వారా వాహనాలు కొనుగోలు చేసేలా ఉండాలి అని తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: