మరాఠీ ఉద్యమాన్ని తీసుకొచ్చి.. మరాఠా ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాటం చేసిన వ్యక్తి బాల్ థాకరే.  ఒక కార్టూనిస్టుగా జీవితాన్ని ప్రారంభించి జరిగిన అవమానాలను తట్టుకొని నిలబడి మరాఠా ప్రజలను ఏకం చేసి.. పోరాటం చేసిన వ్యక్తి బాల్ థాకరే. ముంబైలో ఆయనకంటూ మంచి గుర్తింపు తెచుకున్నాక, శివసేన పార్టీని స్థాపించారు.  శివసేన పార్టీ ఏర్పాటు తరువాత ఆయన లైఫ్ మారిపోయింది.  


శివసేన పార్టీలో కార్యకర్తలు, నాయకులు అనేకమంది శివసేన పార్టీలో జాయిన్ అయ్యారు.  అప్పటి నుంచి మహారాష్ట్రలో శివసేన పార్టీ ఎదుగుతూ వచ్చింది.  అంతకు ముందు మహరాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ చక్రం తిప్పుతుండేది.  కాగా, కాంగ్రెస్ పార్టీకి శివసేన గట్టి పోటీ ఇస్తూ వచ్చింది.  1985 కు ముందు వరకు ఉన్న పరిస్థితులు వేరు... 1985 తరువాత వచ్చిన పరిస్థితులు వేరు.  1985 తరువాత బీజేపీ హిందుత్వ అజెండాతో ప్రజల్లోకి వెళ్తున్న సంగతి తెలుసుకున్న శివసేన .. బీజేపీతో కలిసి అడుగులు వేసేందుకు సిద్ధం అయ్యింది.  


అటు ఆర్ఎస్ఎస్ పార్టీ కూడా బీజేపీకి దగ్గర కావడంతో... శివసేన కూడా బీజేపీకి దగ్గరైంది.  మహారాష్ట్రలో బీజేపీకి మార్గదర్శకంగా ఉంటూ ఎదిగేందుకు సహకరించింది.  ఇప్పుడు 2014 తరువాత దేశవ్యాప్తంగా రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి.  బీజేపీ అధికారంలోకి వచ్చింది. శివసేన అలయన్స్ గా  ఉన్నది.  ఒకప్పుడు శివసేన బలంగా ఉంటె.. ఇప్పుడు బీజేపీ బలం పుంజుకుంది.  గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఏకంగా 122 స్థానాల్లో విజయం సాధించింది.  అలానే, మొన్నటి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది.  


అంతేకాదు, శివసేన బలంగా ఉన్న ప్రాంతాల్లోను బీజేపీ బలం పుంజుకోవడంతో.. శివసేన ఆందోళన చెందుతున్నది.  అందుకోసమే ఎలాగైనా తిరిగి బలపడానికి శివసేన చూస్తున్నది.  అందుకే ఈసారి ఎన్నికల్లో థాకరే కుటుంబం ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నది.  ఆదిత్య థాకరే వర్లి నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు.  గతంలో అక్కడ శివసేన విజయం సాధించింది.  అది సేఫ్ నియోజక వర్గం కాబట్టి అక్కడ నుంచి ఆయన్ను పోటీలో దించుతున్నారు.  అంతేకాదు, ఆయన్ను ఏకగ్రీవంగా ఎంపిక చేసేందుకు పావులు కడుపుతున్నది బీజేపీ శివసేన.  ఒకవేళ పోటీ ఉన్నా కూడా తప్పకుండా శివసేన అక్కడ విజయం సాధిస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: