భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నవంబర్ 12 వ తేదీన పాకిస్తాన్ వెళ్తున్నారు.  పాక్ వెళ్లడం వెనుక ఉద్దేశ్యం ఏంటి అన్నది మాత్రం స్పష్టంగా తెలియడం లేదు.  ఆరోజున గురునానక్ జయంతి.  కర్తార్ పూర్ లో ఉన్న గురునానక్ మందిరాన్ని దర్శించడానికి వెళ్తున్నారని సమాచారం. అక్కడి నుంచి లోధీ వెళ్ళబోతున్నారు.  గురునానక్ జయంతి కంటే రెండు రోజుల ముందుగానే అయన కర్తార్ పూర్ వెళ్ళబోతున్నారు.  


రెండు రోజుల ముందుగా ఎందుకు వెళ్ళబోతున్నారు.  గతంలో పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి ఇండియా మాజీ ప్రధానిని కర్తార్ పూర్ కారిడార్ ఓపెనింగ్ కు ఆహ్వానించారు.  అయితే, ఆ ఆహ్వానాన్ని తిరస్కరించిన సంగతి తెలిసిందే.  కానీ, ఇప్పుడు సడెన్ గా పాక్ ఎందుకు వెళ్తున్నారో అర్ధంకాని విషయం.  గురునానక్ మందిరాన్ని దర్శించుకొని వస్తే అందరికి బాగుంటుంది.  


లేదు పాక్ ఆహ్వానాన్ని మన్నించి అక్కడికి వెళ్లి వాళ్లతో కలిసి కర్తార్ పూర్ కారిడార్ ను ఓపెన్ చేస్తే అది ఇండియాను అగౌరవ పరిచినట్టే అవుతుంది.  దాని వలన ప్రపంచదేశాల్లో భారత్ చులకన అవుతుంది.  ప్రధాని ఉండగా మరో మాజీ ప్రధానికి శతృదేశం ఆహ్వానం పంపితే అక్కడికి వెళ్లడం.. వెళ్లిన తరువాత వాళ్లతో కలిసి ఓపెనింగ్ లో పాల్గొనడం చేస్తే.. ఫలితం ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. 


ప్రపంచదేశాలు కాదు ప్రజలు కూడా భారత్ ను అదోలా చూస్తాయి.  కాబట్టి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా వెళ్లకుండా ఉంటేనే మంచిది.  పాక్ ఆహ్వానాన్ని మన్నించి వెళ్లకుండా ఉండటమే మంచిది అని అటు పంజాబ్ ముఖ్యమంత్రి కూడా పేర్కొన్నాడు.  అయితే, జమ్మూ కాశ్మీర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుండటంతో.. పాక్ వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారేమో చూడాలి.  
దీనిపై కేంద్రం ఇప్పటి వరకు స్పందించలేదు.  పాక్ విషయంలో ఇండియా పెద్దగా రెస్పాండ్ కావడం లేదు.  ఇండియాకు సంబంధించి పాక్ ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే దానికి వ్యతిరేకంగా మాత్రమే కౌంటర్ ఇస్తున్నది.  మిగతా విషయాల్లో మాత్రం తలదూర్చేందుకు సిద్ధంగా లేదన్నది వాస్తవం.  ఇండియా ఈ విషయంలో చాలా క్లియర్ గా ఉన్నది.  వెళ్లాలా వద్దా అన్నది మాత్రం మన్మోహన్ సింగ్ చేతుల్లోనే ఉంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: