ఆటోవాలా.. ఎవరిపైనా ఆధారపడకుండా.. సాయం కోసం ప్రభుత్వం వైపు చూడకుండా.. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి. అందుకే ఇవి లక్షల మందికి స్వయం ఉపాధి సాధనాలు అయ్యాయి. అయితే వీటిలో చాలామందికి సొంత ఆటోలు ఉండవు. చాలా మంది లోను తీసుకుని ఆటోతీసుకుంటారు.


ఆటోల్లోనూ పోటీలు పెరగడంతో వీరికి పూటగడవడమే కష్టమైన సందర్భాలు ఉంటున్నాయి. ఈ సమయంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల, లైసెన్స్‌ రెన్యూవల్‌, ఇన్సూరెన్స్‌, వాహనాల మరమ్మతులు.. ఇలా ఆటోవాలాలు అప్పుల్లో కూరుకుపోతున్నారు. అలాంటి ఆటో, కారు డ్రైవర్లకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆపన్న హస్తం అందించారు. ప్రజల కష్టాలు కళ్లారా చూసేందుకు పాదయాత్ర చేపట్టిన వైయస్‌ జగన్‌ ..ఆటో, కారుడ్రైవర్ల కష్టాలు చూసి చలించిపోయారు. తానున్నాని భరోసా ఇచ్చారు.


అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతూ ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీని కూడా నెరవేర్చారు. వైయస్‌ఆర్‌ వాహన మిత్ర పథకాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ప్రారంభిస్తారు. దేశ చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఆటో, క్యాబ్‌, కారు డ్రైవర్లకు ఏటా రూ.10 వేలు ఉచితంగా అందించే బృహత్తర కార్యక్రమానికి ఏలూరు ఇండోర్‌ స్టేడియంలో సీఎం వైయస్‌ జగన్‌ శ్రీకారం చుడతారు.


పాదయాత్రలో గతేడాది మే 14న ఏలూరులో జరిగిన బహిరంగ సభలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన 4 నెలలకే ఈ పథకాన్ని సీఎం వైయస్‌ జగన్‌ అమలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలతో సెప్టెంబర్ 9న రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ పథకాన్ని సంతృప్తకర స్థాయిలో అమలు చేసేందుకు బడ్జెట్‌లో రూ. 400 కోట్లు కేటాయించింది. ఇందులో రూ. 312 కోట్లు ఇతర కులాలకు, రూ. 68 కోట్లు ఎస్సీలకు, రూ. 20 కోట్లు ఎస్టీలకు కేటాయించనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: