ఆర్టీసీ కార్మిక సంఘాలు రేపటినుండి సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించాయి. ఆర్టీసీ కార్మిక సంఘాలు ఐఏఎస్ అధికారుల కమిటీతో జరిపిన చర్చలు సఫలం కాకపోవటంతో సమ్మె జరుగుతుందని ప్రకటించాయి. ఆర్టీసీ కార్మికులు 26 డిమాండ్లను పెట్టగా ఆ డిమాండ్ల గురించి నిర్ణయం చెప్పటానికి ప్రభుత్వం నెలరోజుల గడువు కోరినట్లు సమాచారం. ఈ నిర్ణయానికి ఆర్టీసీ కార్మికుల జేఏసీ ఒప్పుకోలేదు. 
 
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రధానంగా ఆర్టీసీ కార్మిక సంఘాలు కోరినట్లు తెలుస్తోంది. ఈరోజు మరలా చర్చ జరగబోతుందని తెలుస్తుంది. ఈ చర్చలో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ప్రభుత్వ అధికారుల నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగితే డిస్మిస్ చేస్తామని ప్రకటన వచ్చినట్లు తెలుస్తోంది. సమ్మెకు వెళితే ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తామని ప్రభుత్వం చెప్పినట్లు తెలుస్తోంది. 
 
దసరా పండుగ సమయంలో సమ్మె చేయటం సరికాదని ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు చెబుతున్నా ఆర్టీసీ కార్మిక సంఘాలు మాత్రం వెనక్కు తగ్గటం లేదు. ఆర్టీసీ కార్మిక సంఘాలు మాత్రం మేము ఎలాంటి ప్రకటనలకు భయపడమని చెబుతున్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాలు కొన్ని రోజుల నుండి తమ సమస్యలను ప్రభుత్వం మరియు ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొనివెళ్లామని చెబుతున్నారు. 
 
ఏపీ ప్రభుత్వం తరహాలోనే తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతున్నారు. కమిటీ నెల రోజుల సమయం అడగటం అంటే తమను తప్పుదారి పట్టించటానికి మాత్రమేనని ఆర్టీసీ కార్మిక సంఘాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగితే ప్రత్యామ్నాయంగా తాత్కాలిక డ్రైవర్లను, కండక్టర్లను ప్రభుత్వం నియమిస్తోంది. ఇప్పటికే తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల కొరకు ప్రభుత్వం నియామాకాలు చేపడుతోంది. ప్రైవేట్ స్కూల్ బస్సుల డ్రైవర్లను కూడా ప్రభుత్వం వినియోగించుకోబోతుందని సమాచారం అందుతుంది. తాత్కాలిక డ్రైవర్లకు 1,500 రూపాయలు, కండక్టర్లకు 1,000 రూపాయలు ప్రభుత్వం వేతనంగా చెల్లిస్తుంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: