తెలంగాణాలో ఐదేళ్ల పాటు ఎక్కడా కూడా ఒక్క ధర్నా జరగలేదని, ఎక్కడ ఒక్క లాఠీ ఛార్జి జరగలేదని కెసిఆర్ గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే.  రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగాల విషయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నామని అన్నారు.  ఉద్యోగాల కల్పిస్తామని, తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా నిలబెడతామని అన్నారు.  


కెసిఆర్ ప్రభుత్వంపై క్రమంగా వ్యతిరేకత రావడం మొదలైంది.  ఉద్యోగాల కల్పన విషయంలో ప్రభుత్వం వెనుకబడిపోయింది.  ఇప్పటికే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నోటిఫికేషన్ వేసి పరీక్షలు నిర్వహించారు.  టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ పరీక్షలు జరిగి చాలా కలం అయ్యింది.  రిజల్ట్ ప్రకటించారు. కానీ, ఇప్పటి వరకు పోస్టింగ్ లు ఇవ్వలేదు.  ఇదిగో అదుగో అంటూ కాలాన్ని దాటేస్తున్నారు.  


దీంతో పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ప్రగతి భవన్ ను ముట్టడించారు.  వెంటనే ఉద్యోగాలు కల్పించాలని, అభ్యర్థులకు పోస్టింగ్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.  ఒక్కసారిగా అభ్యర్థులు రోడ్డుమీదకు రావడంతో... ప్రగతి భవన్ ఏరియాలో భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది.  ఎక్కడి వాహనాలు అక్కడ ఆగిపోయాయి.  అసలే కొంతకాలంగా వర్షాలు పడి రోడ్లు పాడైపోయాయి.  


వర్షాల కారణంగా ట్రాఫిక్ జామ్ అవుతుంటే మరోవైపు ఇలా విద్యార్థులు రోడ్డుపై భైఠాయించడంతో ట్రాఫిక్ జామ్ అవుతున్నాయి.   ప్రస్తుతం కెసిఆర్ ఢిల్లీలో ఉన్నారు.  ప్రధాని మోడీతో భేటీ అయ్యేందుకు అయన ఢిల్లీ వెళ్లారు.  9 నెలల తరువాత మోడీతో భేటీ అవుతున్న సమయంలో ఇలా విద్యార్థులు రోడ్డుపై భైఠాయించి పోస్టింగులు ఇవ్వాలని డిమాండ్ చేయడం విశేషం.  మరి  దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.  తెలంగాణా ప్రభుత్వంలో ఎవరికీ అన్యాయం జరగదని అందరికి సమన్యాయం జరుగుతుందని ఇప్పయికే ప్రభుత్వం చెప్పింది.  ఈ బేస్ మీదనే అధికారంలోకి వచ్చింది.  ఇప్పుడు హుజూర్ నగర్ ఉప ఎన్నికల జరుగుతున్న సమయంలో ఇలా జరగడం ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే అంశం అని చెప్పొచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: