ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్య సభకు ఎంపికైన  సురేశ్ ప్రభును తిరిగి కేబినెట్‌లోకి తీసుకు వచ్చే దిశగా మోదీ సర్కారు యోచిస్తోంది. బీజేపీ, టీడీపీ మధ్య ఉప్పు నిప్పులా పరిస్థితి ఉన్న సమయంలోనూ ఆయన చంద్రబాబును పొగడ్తల్లో ముంచెత్తిన సురేశ్ ప్రభును కేబినెట్లోలోకి తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. కేబినెట్ ప్రక్షాళనలో భాగంగా సురేశ్ ప్రభుకి తిరిగి అవకాశం దక్కొచ్చనే ప్రచారం బలంగా జరుగుతోంది.


 మోదీ తొలి మంత్రివర్గంలో కేబినెట్ హోదాలో పని చేసిన సురేశ్ ప్రభును రెండోసారి అధికారంలోకి వచ్చాక పక్కనబెట్టారు. దీనికి కారణం లేకపోలేదు....ఏపీ కోటా నుంచి పెద్దల సభకు ఎన్నికైన సురేశ్ ప్రభు.. చంద్రబాబుపై అనేకసార్లు ప్రశంసలు గుప్పించారు. దేశంలో బెస్ట్ సీఎం బాబు అంటూ ప్రశంసించారు. దీంతో సురేశ్ ప్రభును మోదీ  పక్కనబెట్టడానికి చంద్రబాబుతో స్నేహం కూడా కారణమనే ప్రచారం జరిగింది. ప్రస్తుతం పీయూష్ గోయల్ నిర్వహిస్తోన్న వాణిజ్యం, పరిశ్రమల శాఖ బాధ్యతలను సురేశ్ ప్రభుకి అప్పగించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మోదీ తొలి కేబినెట్‌లో ముందుగా రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సురేశ్ ప్రభు.. అనంతరం వాణిజ్యం, పరిశ్రమల శాఖ బాధ్యతలను పర్యవేక్షించారు. 
ఇటీవల జీ20 సదస్సులో షెర్పాగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు. ఆర్థిక మాంద్యం ముంగిట దేశ ఆర్థిక వ్యవస్థ ఉండటంతో.. సమర్ధుడైన సురేష్ ప్రభువును మళ్లీ క్యాబినెట్ లోకి తీసుకుని అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.


ఇప్పటికే వంద రోజుల పాలన ముగిసిన సందర్భంగా.. 15 రోజుల్లో కేబినెట్‌ ప్రక్షాళన ఉంటుందనే ప్రచారం జరుగుతోంది.తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఏపీ నుంచి ఎవరికీ కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కలేదు. దీంతో ఆంధ్రాకు చెందిన బీజేపీ నేతకు కూడా మంత్రి పదవి దక్కొచ్చనే ప్రచారం జరుగుతోంది. మరోపక్క ఈ రేసులో రామ్ మాధవ్ ముందు వరుసలో ఉన్నారని.. కన్నా లక్ష్మీనారాయణ, సుజనా చౌదరి కూడా పోటీలో ఉన్నారని టాక్. వీరిలో ఎవరికి మంత్రి పదవి దక్కుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: