తనదైన శైలి వార్త కథనాలతో సరితోత్త ఒరవడిని సృష్టించిన రవి ప్రకాష్ ను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టివి 9  రవి ప్రకాష్ గా చిరపరిచితమైన రవి ప్రకాష్ ఎన్నో సంచలనమైన కథనాలను ప్రసార మద్యల ద్వారా వినిపించిన విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో  కొద్దిసేపటి క్రితం, రవిప్రకాష్ నివాసానికి వెళ్ళిన పోలీసులు‌‌‌, తమ అదుపులోకి తీసుకొన్నట్టు సమాచారం, అరెస్టు చూపిస్తారా...? లేక విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకొన్నారా అన్నది తెలియాల్సి ఉంది. ఏ కేసుకు సంబంధించి, ఏ సెక్షన్ ప్రకారం అదుపులోకి తీసుకొన్నారో చెప్పేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. టీవీ9 వార్తా సంస్థ మాజీ సీఈవో రవి ప్రకాశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న వార్త సోషల్ మీడియా తెగ వైరల్ అవుతుంది.


ఆయన నివాసంలో  అదుపులోకి తీసుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు  విచారిస్తున్నారు. రవి ప్రకాష్  ఇంటికి పదిమంది పోలీసులు బృందం వెళ్లినట్టు సమాచారం ఇప్పటికే రవిప్రకాష్ పైన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదైనాయి నిధుల గోల్మాల్ సంబంధించి ఒక కేసు నమోదు కాగా టీవీ9 లో గాని అనధికారికంగా అమ్మరు ఆరోపణల పై మరో కేసు నమోదైంది.ఈ రెండు కేసులు సంబంధించి అతని పైన ఇప్పటికే 41 సిఆర్ ఫై సీ కింద నోటీసు ఇచ్చారు.  ఈ రెండింటిలో కూడా గతంలోనే అధికారులు విచారించారు. 



 కారణం చెప్పకుండా రవిప్రకాశ్‌ను తీసుకెళ్లిన పోలీసులుఛానల్ నిర్వహణకు సంబంధించిన కొన్ని పత్రాలు కనిపించకుండా పోవడంతోపాటు, కీలక పత్రాలు ఫోర్జరీకి సంబంధించిన కేసులో గతంలోనూ పోలీసులు ఆయన్ను విచారించిన విషయం తెలిసిందే.అరెస్టు కాకుండా చేసిన విశ్వ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఇటీవల తొలి వెలుగులో రవి ప్రకాష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.టీవీ నైన్ ఫోర్జరీ కేసు, లోగో లు అమ్ముకున్న కేసు, అక్రమ సంపాదనల పై గతంలో కేసులు  నమోదయ్యాయి . ఈ పరిణామాల నేపథ్యంలోనే రవి ప్రకాష్ అరెష్ అని మీడియా భోగట్టా.


మరింత సమాచారం తెలుసుకోండి: