ఆరునెలల్లోనే ఉత్తమముఖ్యమంత్రి అనిపించుకుంటానని, ఆదర్శపాలన అందిస్తానని చెప్పిన జగన్మోహన్‌రెడ్డి మహిళలపై దాడులు జరుగుతున్నా, ఎందుకు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారో సమాధానం చెప్పాలని తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ శ్రీమతి పోతులసునీత డిమాండ్‌ చేశారు.  మౌనంగా ఉండటమేనా జగన్‌చెప్పిన ఉత్తమ, ఆదర్శపాలన అని టీడీపీ మహిళానేత ఎద్దేవాచేశారు. నిజాయితీ, నిబద్ధతలతో పనిచేస్తున్న ప్రభుత్వాధి కారులకు రాష్ట్రంలో రక్షణలేకుండా పోయిందన్న ఆమె, అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు తామేంచేస్తున్నామో తెలియనంతగా, విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటే, వారించాల్సిన ప్రభుత్వాధినేత ఎందుకు నటిస్తున్నాడన్నారు. 

ప్రభుత్వాధికా రులకే రాష్ట్రంలో రక్షణలేకపోతే, సామాన్యప్రజల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నారు. నాలుగునెలల్లోనే ప్రజలకు నరకంచూపిన ముఖ్యమంత్రి, గూండాలు, వీధిరౌడీల్లా ప్రవర్తిస్తున్న తనపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులను కట్టడిచేయడంలో ఘోరంగా విఫలమయ్యారని సునీత మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ, నెల్లూరుజిల్లాలో వైసీపీనేతల ఆగడాలు ఎక్కువయ్యాయన్న సునీత, తాజాగా ఎంపీడీవోపై జరిగిన దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. నియోజకవర్గంలోని ప్రజలకు తండ్రిలా రక్షణ కల్పించాల్సిన ఎమ్మెల్యేనే,  తన ఆదేశాలను పాటించలేదన్న కోపంతో, ఎంపీడీవో సరళపై దాడిచేయడం, ఆమెఇంటికి విద్యుత్‌, కేబుల్‌, కొళాయి కనెక్షన్‌లు నిలిపేయడం, ఇంటిముందు చెత్తవేయడం, సదరు అధికారిణి కుటుంబసభ్యులపై బెదిరింపులకు పాల్పడినా కోటంరెడ్డిపై చర్యలు తీసుకోవ డానికి ప్రభుత్వం ఎందుకు జంకుతోందని ఎమ్మెల్సీ నిలదీశారు. 


రాష్ట్రంఎటుపోతోంది, ప్రభుత్వపాలన ఎలా ఉందనేది ఈ ఘటనతో ప్రజలందరికీ తెలిసిపోయిందన్న సునీత,    ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రజలు-అధికారుల పక్షమో, వారినివేధిస్తున్న తనపార్టీ నాయకుల పక్షమో స్పష్టంచేయాల్సిన సమయంవచ్చిందన్నారు. అనధికారకంగా లేఅవుట్‌ ఏర్పాటుచేయడమే గాక, దానికి నీటిపైపులైన్‌ వేయలేదన్న సాకుతో మహిళా అధికారిపై  దాడి చేయడం ఎంతటి వికృతపోకడో చెప్పాల్సిన పనిలేదన్నారు. తనపై దాడిజరిగితే  భయంతో అర్థరాత్రి పోలీస్‌స్టేషన్‌కు వెళితే ఎంపీడీవో నుంచి ఫిర్యాదు తీసుకోకుండా పోలీసులు ఆమెను ఆరుబయట కూర్చోబెట్టి మరింతగా అవమానించారన్నారు. ఎంపీడీవోసరళపె అమానుషంగా దాడిచేసిన కోటంరెడ్డి తక్షణమే ఆమెఇంటికి వెళ్లి, కుటుంబసభ్యుల సమక్షంలో ఆమెకు క్షమాపణ చెప్పాలని, జరిగినతప్పుని ఒప్పుకోవాలని,  లేకుంటే ఉద్యోగ, మహిళాసంఘాలతో కలిసి, ప్రభుత్వదాష్టీకాలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని తెలుగుమహిళ రాష్ట్రనేత హెచ్చరించారు. 


ప్రజలకు, ప్రభుత్వానికి అనుసం ధానంగా వ్యవహరించే అధికారులపై ప్రజాప్రతినిధులే దాడిచేస్తే,వారిని  నిలువరించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై లేదా అని సునీత ప్రశ్నించారు. అలానే  రాజకీయరంగంలోని మహిళలతోపాటు, ఇతరరంగాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్న స్త్రీలపై సోషల్‌మీడియాలో సభ్యసమాజం అసహ్యించుకునేలా వైసీపీకార్యకర్తలు, ఆపార్టీ సానుభూతిపరులు చేస్తున్న విషప్రచారంపై కూడా ప్రభుత్వాధినేత స్పందించాలని ఆమె డిమాండ్‌చేశారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: