ప్రపంచంలో అన్ని పాములు విషపూరితమైనవి కాదు.  పాముల్లో ఎన్నో జాతులు ఉన్నాయి.  అందులో కొన్ని మాత్రమే విషపూరితమైన పాములు.  అయితే, పాముల విషయంలో ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాలి.  పొరపాటున పాము కరిస్తే.. ఆ కరిచింది విషపూరితమైన పాము కాదులే అని ఊరుకుంటే.. నలుగురు కలిసి ఊరికి ఉత్తరానికి మోసుకెళ్లాల్సి వస్తుంది.  పాము కరిచిన వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లడం మంచిది.  


మనదగ్గర సాధారణంగా కనిపించే పాములు అన్ని ఒకేలా ఉంటాయి.  కొంచెం తేడాతో. అయితే, బ్రెజిల్ రాజధాని సావోపోలో కు 32 కిమీ దూరంలో స్నేక్ ఐలాండ్ అని దీవి ఉంది.  ఆ దీవిలో 4000 కు పైగా మాములు ఉన్నాయి.  ఆ దీవి ఎంత పెద్దది అనుకుంటే పొరపాటే.. ఆ దీవి వైశాల్యం 1100 చదరపు ఎకరాలు.  ఈ దీవిలో ప్రత్యేకంగా కనిపించే పాము గోల్డెన్ ల్యాన్స్ హెడ్.  ఈ పాము గోల్డ్ కలర్ లో ఉంటుంది.  


చాలా అమాయకంగా, అందంగా ఉంటుంది.  బాగుంది కదా అని దగ్గరికి వెళ్తే కాటేస్తుంది.  దీని కోరల్లో ఉండే విషం మాములు పాముల్లో ఉండే విషం కంటే ఐదు రేట్లు ఎక్కువగా ఉంటుంది.  ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము ఇది.  ఇది కరిస్తే శరీరంలోపలే కాదు శరీరంపైన ఉన్న చర్మం కూడా వెలుగుతున్న కొవ్వోత్తిలోని మైనం కరిగిపోయినట్టు కరిగిపోతుంది.  ఒకప్పుడు ఈ స్నేక్ ఐలాండ్ బ్రెజిల్ తో కలిసి ఉండేది.  సముద్రంలో ఏర్పడిన అలజడి.. పగుళ్ల వలన ఆ భాగం సముద్రంలోకి నెట్టబడింది.  ఇక సముద్ర మట్టం పెరగడం వలన స్నేక్ ఐలాండ్ దేవిగా మారిపోయింది.  


ఈ దీవిలోకి సామాన్య ప్రజలను ఎవ్వరిని అక్కడి ప్రభుత్వం అనుమతించడం లేదు.  పరిశోధనకులు, నేవీ, ఆర్మీకి మాత్రమే అక్కడికి వెళ్లేందుకు అనుమతి ఉంది.  ఎవరైనా సరే అక్కడి వెళ్ళాలి అంటే ప్రాణాల మీద ఆశలు వదిలేసుకొని వెళ్ళాల్సింది.  ఆ దీవిలో ఒక లైట్ హౌస్ కూడా ఉన్నది.  మొదట ఆ లైట్ హౌస్ విధులు నిర్వహించేందుకు అక్కడికి ఓ కుటుంబాన్ని పంపింది.  ఆ కుటుంబం కొన్ని రోజుల తరువాత గోల్డెన్ స్నేక్ కాటుకు బలయ్యారు. 

లైట్ హౌస్ లైట్ ఆపకుండా వెలుగుతూనే ఉండటంతో అనుమానం వచ్చిన అధికారులు అక్కడి వెళ్లి చూసి షాక్ అయ్యారు. అప్పటి నుంచి లైట్ హౌస్ లోని లైట్లను ఆటోమాటిక్ చేసింది.  సావోపోలో నుంచే ఆపరేట్ చేయడం మొదలు పెట్టింది.  సముద్రంలో తుఫాను వచ్చినపుడు.. దీవి లోనుంచి గోల్డెన్ స్నేక్ పాములు సావోపోలో లో ప్రవేశిస్తుంటాయి.  ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంటాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: