ఏపీ టీడీపీ అధినేత చంద్ర‌బాబు న‌యా పాలిటిక్స్ ప్రారంభించారు. తాజాగా ఆయ‌న వ్యాఖ్య‌లు, విమ‌ర్శ‌లు వినేవారికి ఇలానే అనిపిస్తోంది. రాజ‌కీయాల్లో ఆయ‌న ఇప్పుడు నిబ‌ద్ధ‌త‌ను కోరుతున్నారు. దాప‌రికం లేని రాజ‌కీయాలు కావాల‌ని అంటున్నారు. నిజానికి దేశంలో ఇలాంటి వ్యాఖ్య‌లు ఇప్పుడే తొలిసారి వింటున్నాం అనే సీనియ‌ర్ రాజ‌కీయ పండితులు కూడా క‌నిపిస్తున్నారు. ఇవ‌న్నీ.. చంద్ర‌బాబు ఎవ‌రిని ఉద్దేశించి, ఎవ‌రి గురించి వ్యాఖ్యానిస్తున్నారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఏపీలో పాల‌న సాగిస్తున్న జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై చంద్ర‌బాబు ఇలా వ్యాఖ్య‌లు చేస్తున్నారు.


`ఎన్నికల ముందు వాహ‌న దారులు అంద‌రికీ రూ.10 వేలిస్తామని చెప్పి.. తీరా అధికారంలోకి వచ్చాక అనే క ఆంక్షలు విధించి టోకరా ఇచ్చారు. కేవలం 1.73 లక్షల దరఖాస్తులే రావడం వైసీపీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. ఇప్పుడు చెప్పే ఆంక్షలన్నీ ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదు? ఇవన్నీ ఉంటేనే ప్రభు త్వ లబ్ధి ఉంటుందని అప్పుడే ఎందుకు చెప్పలేదు? ఓడ ఎక్కేదాకా ఓడ మల్లయ్య, ఓడ దిగాక బోడి మల్ల య్య అన్నట్లు దారుణంగా వ్యవహరిస్తున్నారు..’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్య‌ల పైనే రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది.


ఎన్నిక‌ల‌కు ముందే ప‌థ‌కాల‌కు సంబంధించిన ష‌ర‌తులు, నిబంధ‌న‌లు ఎందుకు వెల్ల‌డించ‌రు!? అనేది బాబు ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ఇదే న‌యా రాజ‌కీయం. నిజ‌మే! ప్ర‌జాస్వామ్య వాదులు కూడా దీనిని ఆహ్వానిస్తు న్నా రు. అయితే, గ‌తంలో తాము అమ‌లు చేసిన ప‌థ‌కాలు కూడా చ‌ట్టుబండ‌లుగానే మారాయి క‌దా? అప్పుడు మీరు నిజాయితీగా నిబంద‌న‌ల జాత‌ర‌ను బ‌య‌ట‌కు చెప్పారా?  రైతులకు రుణ మాఫీ అన్నారు. డ్వాక్రా మ‌హిళ‌ల‌కు రుణ మాఫీ అన్నారు. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ ఇంకేముంది చిటికెలో చేస్తామ‌న్నారు. మ‌రి వీటిని నిక్క‌చ్చిగా నిబ‌ద్ధ‌త‌గా అమ‌లు చేశారా?


ష‌ర‌తులు ప్ర‌క‌టించి.. ప‌బ్బం గ‌డుపుకొన్నారా?  రైతు రుణ మాఫీ ఐదేళ్ల‌లో చేయ‌క‌పోగా 5, 4 విడ‌తల మాఫీ సొమ్మును జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇవ్వాల‌ని డిమాండ్ చేసి అభాసు పాల‌య్యారు డ్వాక్రామ‌హిళ‌ల‌కు ప‌సుపు కుంకాలంటూ.. పాట పాడారు. కాపు రిజ‌ర్వేష‌న్ల‌పై రోజుకో ఫీట్ చేశారు. మ‌రి మ‌నం ఎదుటివారికి చెప్పేముందు గ‌డిచిన ఐదేళ్ల‌లో మ‌నం ఎలా వ్య‌వ‌హ‌రించాం.. ? అనేది ఒక్క‌సారి త‌ర‌చి చూసుకోవాలి క‌దా బాబూ.. అదేక‌దా అనుభ‌వం అంటే!! ఏదేమైనా మీకు , మీ న‌యా రాజ‌కీయాల‌కు ఓ న‌మస్కారం అంటున్నారు విశ్లేష‌కులు.



మరింత సమాచారం తెలుసుకోండి: