టీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు నిజంగానే ఇప్పుడు బ్యాడ్ టైం మొదలు అయిపోయినట్టుగా ఆసక్తికర విశ్లేషణలు కొనసాగుతున్నాయి. ఓ వైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె... మరోవైపు దానికి మద్దతుగా ప్రభుత్వ ఉద్యోగుల పెన్ డౌన్ చేసే యోచన... వెరసి కేసీఆర్ కు పెద్ద ట్రబుల్ వచ్చేలాగా ఉంది అని వాదనలు వినిపిస్తున్నాయి. మూడు రోజుల నుంచి కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెను విరమింపజేసేందుకు కేసీఆర్ కఠినంగానే ఉన్నపటికీ కూడా  దాఖలాలు చాలా స్పష్టంగానే కనిపిస్తున్నాయి. 


అయితే కేసీఆర్ బెదిరింపులకు ఎంతమాత్రం ఆర్టీసీ కార్మికులు బెదరడం లేదు. ఎస్మా ప్రయోగించినా సమ్మె విరమించేది లేదని తెగేసి తెలియచేస్తునారు. ఈ క్రమంలో పండగలోగా సమ్మె ముసిగిపోతే ఏమి ఫరవాలేదు గానీ.. పండగ తర్వాత కూడా సమ్మె ఇలాగే కొనసాగితే... మాత్రం ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కనీసం పెన్ డౌన్ అయినా చేయాల్సిందే అన్న  భావన  ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు వచ్చినట్లుగా  వార్తలు చాలా కలకలం సుష్టిస్తున్నాయి.


ఇప్పటికే ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు సమాలోచనలు మొదలు పెట్టారు. ఇప్పటికే ఈ దిశగా కీలక భేటీలు జరగగా... పండగ ముగిసిన వెంటనే ఈ సంఘాలన్నీ మరోమారు భేటీ అవుతున్నట్లు  వార్తలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తాము చేసిన సకల జనుల సమ్మెకు ఆర్టీసీ కార్మికులు వెన్నుదన్నుగా నిలిచిన విధానాన్ని ప్రభుత్వ ఉద్యోగులు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. తమకు సాయం చేసిన ఆర్టీసీ కార్మికులకు ప్రతిఫలంగా తాము కూడా ఆర్టీసీ సమ్మెకు మద్దతు పలికే  కోణంలో యోచిస్తు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు అనుకుంటున్నారు.


 ఈ దిశగా నేరుగా సమ్మెలో పాల్కొనకున్న.. కనీసం పెన్ డౌన్ చేసే తరహా నిరసనలు చేపట్టాలని ఓ అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది అందరికి. పండగలోగా సమ్మె కాల్ ఆఫ్ అయితే ఓకే గానీ.. పండగ తర్వాత కూడా సమ్మె కొనసాగితే మాత్రం ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా పెన్ డౌన్ చేయాల్సిందేనని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు చెందిన మెజారిటీ నేతలు నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ఇదే జరిగితే.. ఇప్పటికే ఆర్టీసీ సమ్మెను విరమింపజేసేందుకు తనదైన యత్నాలు చేస్తున్న కేసీఆర్.... ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కూడా రంగంలోకి దిగితే తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోక తప్పదన్న విశ్లేషణలు తెలుపుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: