మహారాష్ట్ర ఎన్నికల నగారా మోగింది.  అక్టోబర్ 21వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి.  ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని బీజేపీ చూస్తున్నది.  దానికి తగ్గట్టుగా ప్లాన్ చేస్తున్నది. గత ఎన్నికల్లో బీజేపీ, శివసేన పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి.  బీజేపీ 124 స్థానాల్లో, శివసేన 63 స్థానాల్లో విజయం సాధించింది.  ఈ రెండు కలిసి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.  అయితే ఈసారి జరిగే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి.  


రెండు కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి తిరిగి అధికారంలోకి వస్తారనే ధీమాగా ఉన్నాయి రెండు పార్టీలు.  రెండు పార్టీలు ప్రచారాన్ని జోరుగా చేస్తున్నాయి.  ఎక్కడ తగ్గే పరిస్థితి లేదు.  గతంలో కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించాలని బీజేపీ, శివసేన పార్టీలు చూస్తున్నాయి.  దీనికి మిషన్ 220 అనే పేరు పెట్టింది.  288 స్థానాలున్న మహా అసెంబ్లీలో 220 స్థానాలు గెలవడమే లక్ష్యంగా పెట్టుకొని ప్రచారం నిర్వహిస్తున్నాయి.  


కాంగ్రెస్... ఎన్సీపీలు కూడా ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి.  ఈసారి విశేషం ఏమిటంటే.. శివసేన నుంచి బాల్ థాకరే మనమడు ఆదిత్య థాకరే పోటీ చేస్తున్నారు.  శివసేన పార్టీ పుట్టిన తరువాత మొదటిసారి ఆ కుటుంబం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.  అక్కడ ఆదిత్య థాకరే తప్పకుండా భారీ విజయం సాధిస్తాడు అందులో సందేహం అవసరం లేదు.  


ఇదిలా ఉంటె, రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి, ప్రత్యర్థి పార్టీలు  ఎన్ని సీట్లు గెలుచుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది.  గతంలో కాంగ్రెస్, ఎన్సీపీలు కలిసి 80 సీట్లు గెలుచుకున్నాయి.  మరి ఈసారి ఆ 80 స్థానాలను నిలబెట్టుకుంటుందా లేదంటే సంఖ్య తగ్గుతుందా చూడాలి.  బీజేపీ తరపున ప్రధాని మోడీ, అమిత్ షాలు ప్రచారం నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు.  తమదైన శైలిలో ప్రచారం నిర్వహించేందుకు మోడీ అస్త్రశస్త్రాలను రెడీ చేసుకుంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: