పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం కోట్లాది రూపాయలను నష్టం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ పేర్కొన్నారు. రూ. 7,500 కోట్లకు పైగా పరోక్షంగా రాష్ట్రానికి నష్టం చేసింది. 28 నెలల్లో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుని 58 నెలల కాలం పట్టేలా చేసింది. ముఖ్యమంత్రి జగన్‌  డిల్లీ పర్యటన స్వప్రయోజనాల కోసం తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదనేది ప్రజలకు అర్దమైంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే మెదటి సారి డిల్లీ వెళ్లి పోలవరం ముంపు మండలాలు ఏపీలో కలిపేలా కృషి చేసి విజయం  సాధించారు. కానీ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పటి వరకు 4 సార్లు డిల్లీ వెళ్లి సాధించేంటి? ఆయన పర్యటనలకు ప్రభుత్వ ఖజానాకు  ఖర్చు తప్ప  రాష్ట్రానికి ఒరిగిందేంటి?  అని ప్రశ్నించారు. 

దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రధానితో భేటీ అయినా సరే.. ఆ భేటీ ముగిసాక ఆ విషయాలు మీడియాకు వెల్లడిస్తారు. కానీ మీరు మీడీయా ముందు మాట్లాడానికి ఎందుకు నిరాకరించారు? దీన్ని బట్టే ఆ భేటీలో మీ కేసులు మాపీ, మీరు, కేసీఆర్‌ కలిసి దోచుకునేందుకు   ప్రణాళికి రూపొందించుకున్న గోదావరి జలాలు తరలింపు అంశంపైనే చర్చ జరిగివుంటుందని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు.       ప్రతి శుక్రవారం కోర్టు మెట్లు ఎక్కుకుండా చూడాలని మోదీని ప్రాదేయపడడానికి డిళ్లీ  వెళ్లారా? ఎన్నికలకు ముందు కేంద్రం మెడలు వంచుతా, డిల్లీ పై యుద్దం చేస్తానన్న జగన్‌ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి కేసుల మాఫీీ కోసం రంగం సిద్దం చేస్తున్నారు. గతంలో నిద్రలో కూడా హోదా గురించి కలవరించిన జగన్‌ నేడు ప్రధాని ముందు హోదా గురించి ఎందుకు మాట్లాడలేదు? 25 మంది ఎంపీలను గెలిపిస్తే.. దేశం మెత్తం మనవైపు చూసేలా పోరాటం చేసి  హోదా సాధిస్తాని జగన్‌ అన్నారు. మరి ఇప్పుడెందుకు పోరాటం చేయటం లేదు, 25 ఎంపీలకు ముగ్గురు తక్కువయ్యారని ఆగారా? వైసీపీది హోదా కోసం పోరాటం కాదు, కేసుల మాపీ కోసం ఆరాటం అన్న విషయం ప్రజలకు మరోసారి స్పష్టమైంది.

రాష్ట్ర జీవనాడి అయిన పోలవరంకు రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన బకాయిల గురించి   అడగకుండా, గోదావరి జలాల గురించి ఎవరడగమన్నారు.గోదావరి జలాలను తెలంగాణ భూబాగం నుంచి తరలించాల్సిన అవసరం లేదని, అలా చేస్తే రాష్ట్రం నష్టపోతుందని మేధావులు, ప్రజలు మొత్తుకున్నా మీరెందుకు మొండిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. గోదావరి నీళ్ల ద్వారా రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని  కేసీఆర్‌ అంటే మీరెలా నమ్ముతున్నారు? నాడు  రాయలసీమకు వరద నీటిని తరలిస్తే కూడా ఓర్వలేని కేసీఆర్‌ నేడు రాయలసీమను సస్యశ్యామలం చేస్తానంటే ప్రజలు నమ్మాలా? గోదావరి జలాల తరలింపు పేరుతో  లక్షా 50 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుకు రూపకల్పన చేసి నువ్వు, నీ మిత్రుడు కేసీఆర్‌ కలిసి రెండు రాష్ట్రాల ఖజానాను మీ ఇళ్లలో నింపుకునేందుకు సిద్దమయ్యారని అర్దమౌతోంది. కాళేశ్వరంలో జరిగిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్‌, సీబీఐ అవినీతి కేసుల మాపీ కోసం జగన్‌ మోదీని కలిసి పైకి మాత్రం రాష్ట్ర ప్రయోజనాలు అంటూ కలరింగ్‌ ఇస్తున్నారు.


ఇద్దరు ముఖ్యమంత్రులు కలసి ఎవరి చెవిలో పూలు పెడదామని చూస్తున్నారు.మీ భేటీలో ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోలేని అయాకులు కాదు తెలుగు రాష్ట్రాల ప్రజలు. ఐదు కోట్ల ఆంధ్రులకు ప్రతినిధిగా ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రితో జరిగిన సమావేశంలో చర్చించిన విషయాలను గురించి 48 గంటల తర్వాత కూడా ఎందుకు బయటపెట్టడం లేదో ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. కేసుల మాఫీ గురించా.. లేక మీ కాంట్రాక్టర్‌ కోసమా..? దేని కోసం మీరు ప్రధానిని కలిశారు.? పోలవరం పనుల్ని మేఘా సంస్థకు కట్టబెట్టి లబ్ది చేకూర్చేందుకు నిబంధనలు మార్చేందుకు మీరు సాయశక్తులా కృషి చేసిన  విషయం వాస్తవం కాదా.? ఆర్టీసీలో ఎలక్ట్రిక్‌ బస్సుల ఏర్పాటు కాంట్రాక్టును కూడా మేఘా సంస్థకు అనుబంధమైన సంస్థకే ఎందుకు కేటాయించినట్లు.? పోలవరంలో రివర్స్‌ టెండరింగ్‌ అంటూ ప్రకటించి ఒకే కాంట్రాక్టర్‌ టెండర్‌ ప్రక్రియలో పాల్గొనేలా చేయడంలో ఆంతర్యమేంటి.?ఆ కాంట్రాక్టరుపై మీకెందుకంత ప్రేమ.? ఎన్నికల సమయంలో ఆర్భాటంగా ప్రకటించిన నవరత్నాల గురించి ఎం ప్రస్తావించారు.? మీ చేతగాని తనంతో రాష్ట్రం ఎదుర్కొంటున్న చీకట్ల గురించి ఏం చర్చించారు.? రాష్ట్రానికి అవసరమైన రాజధాని గురించి ఏం చర్చించారు.? అసలు మీ భేటీలో రాష్ట్రం గురించి గానీ, రాష్ట్ర ప్రజల సమస్యల గురించి గానీ చర్చించారా.? లేక మీ కేసుల గురించి చర్చించారా.? సీబీఐ కోర్టులో మీ విజ్ఞప్తికి భిన్నంగా వాదనలు జరిగిన వెంటనే ఢిల్లీ పరిగెత్తుకుని వెళ్లడం వెనుక అంతర్యాన్ని ప్రజలు గమనించారు. సమావేశం వివరాలు బయటపెట్టేందుకు ఎందుకు వెనకాడుతున్నారు.? మీడియాకు చెప్పలేనంతటి రహస్యాలు ఏం చర్చించారో ప్రజలకు వివరించాలని మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ డిమాండ్‌ చేశారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: