హర్యానా అసెంబ్లీకి ఈనెల 21 వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి.  ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.  దానికి  పావులు కదిపేందుకు సిద్ధం అవుతున్నది.  అయితే, పార్టీ సీనియర్ నేతలను పక్కన పెడుతుండటంతో ఆ పార్టీ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.  సీనియర్ నేతలు లేకుండా ఎన్నికల్లో విజయం సాధించడం కష్టం అవుతుందని, వారి సలహాలు సూచనలు అవసరం అని అంటున్నా కాంగ్రెస్ పార్టీ వినిపించుకోవడం లేదట.  


ఇటీవలే హర్యానా పీసీసీ అధ్యక్షుడు అశోక్ తన్వర్ రాజీనామా చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రాజీనామా చేయడంతో పార్టీ నేతలు షాక్ అయ్యారు.  ఇలా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పీసీసీ అధ్యక్షుడు అశోక్ తన్వర్ రాజీనామా చేయడం పార్టీ ఓటమిని ముందుగానే అంగీకరించినట్టు అవుతుందని అన్నారు.


ఇదిలా ఉంటె, పీసీసీ అధ్యక్షుడు రాజీనామా చేసిన కొన్ని రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సంపత్ సింగ్ కూడా రాజీనామా చేశారు.  ఇది కాంగ్రెస్ పార్టీకి దెబ్బ అని చెప్పాలి.  కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంపత్ సింగ్ బీజేపీ ముఖ్యమంత్రి ఖట్టర్ ను కలిశారు.  తన సహచరుడు కూడా టచ్ లో ఉన్నాడని, తన్వర్ కూడా బీజేపీలో చేరే అవకాశం ఉందని సంపత్ సింగ్ ఖట్టర్ తో చెప్పుకొచ్చారు.  ఇది కాంగ్రెస్ పార్టీకి దెబ్బ అని చెప్పొచ్చు.  


తన్వర్, ఖట్టర్ లు మాత్రమే కాదు.. ఇంకా చాలామంది నేతలు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం.  కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలవుతుందని ముందుగానే తెలుసుకున్న నేతలు ఆ పార్టీని వదిలి బీజేపీతో దోస్తీ కట్టేందుకు క్యూ కడుతున్నారు.  మరి కాంగ్రెస్ నుంచి వస్తున్న వ్యక్తులకు బీజేపీ స్వాగతం పలుకుతుందా లేదంటే ఎన్నికలు పూర్తయ్యే వరకు కామ్ గా ఉంటుందా చూడాలి.  ఈ ఎన్నికలు బీజేపీకి చాలా కీలకం.  బీజేపీ దేశంలో అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంది.  ఇలా సంచలన నిర్ణయాలు తీసుకున్నాక జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఇక్కడ విజయం సాధించడం బీజేపీకి చాలా అవసరం.  అంతేకాదు, మిషన్ 75 పేరుతో ప్రచారం చేస్తున్నది.  మరి ఆ మార్క్ ను బీజేపీ రీచ్ అవుతుందా లేదా అన్నది తెలియాలంటే ఈనెల 24 వరకు ఆగాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: