వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత వరసగా పధకాలు ప్రారంభిస్తూ..  వరసగా పనులను చక్కబెడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తున్నారు.  ఇప్పటికే అనేక రంగాల్లో రాష్ట్రం అభివృద్ధివైపు పరుగులు పెడుతున్నది.  గత పాలకులు చేయని చాలా పనులను ఈ ప్రభుత్వం చేసింది.  ప్రజల్లో విశ్వాసం పెంచుకుంటోంది. పాలకులకు ప్రజలకు మధ్య దూరాన్ని తగ్గించి వేసింది. 

దానికి ఓ ఉదాహరణ గ్రామ సచివాలయ వ్యవస్థ అని చెప్పొచ్చు.  గ్రామా సచివాలయం ద్వారానే ఇకపై ప్రజలకు అన్ని రకాల పనులు అందుబాటులోకి వస్తాయి.  దాదాపుగా 500 వరకు పనులు ఈ గ్రామ సచివాలయం ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటాయి.  గ్రామాల్లోనే అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంటె.. ఇకపై ప్రజలు పట్టణాలను నగరాలకు తరలివెళ్లాల్సిన అవసరం ఉండదు.  


పుట్టిన ఊరిలోనే ప్రశాంతంగా జీవనం గడిపేందుకు వీలు ఉంటుంది.  గ్రామాల్లో రైతుల కోసం రైతు భరోసా పధకం తీసుకురాబోతున్నారు.  ఈ పధకాన్ని ఈనెల 15 వ తేదీ నుంచి అమలు చేయడానికి సిద్ధం అవుతున్నారు.  ఈ పధకం అమలు జరిగితే జగన్ కు రాష్ట్రంలో తిరుగుండదు అన్నది వాస్తవం.  ఇప్పటికే జగన్ కు ప్రజల్లో మంచి పేరు వచ్చింది.  జగన్ అధికారంలో ఉంటె ప్రజలకు మంచి జరుగుతుంది అనే ఒక నానుడి ఉన్నది.  


అక్టోబర్ 15 నుంచి ప్రారంభించబోతున్న రైతు బంధుపధకం ద్వారా అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వం సంవత్సరానికి రూ. 12500 రూపాయలు డబ్బును వారి అకౌంట్స్ లో జమచేస్తుంది.  దీంతో పాటు రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలను గ్రామసచివాలం ద్వారా అమలు చేయబోతున్నది.  అంతేకాదు, ఇకపై గ్రామ సచివాలయం ద్వారానే పురుగుమందులు వగైరా వంటివి కూడా అందుబాటులో ఉంటాయి.  గ్రామాల్లోనే స్వరాజ్యం స్థాపన సిద్ధిస్తుందని ఫలితంగా రాష్ట్రం హ్యాపీగా ఉంటుందని బలంగా నమ్ముతున్నాడు జగన్. మరి ఏం జరుగుతుందో చూద్దాం.  


మరింత సమాచారం తెలుసుకోండి: