రాష్ట్ర విభజన నాటి నుండి ఏపీ ప్రజలకు దూరమైన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకులను ఈ ఏడాది నుండి నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్నిర్ణయించారు.  2013వ సంవత్సరం వరకూ ప్రతీ ఏటా నవంబర్ 1న ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించే వారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ మాత్రం రాష్ట్ర విభజన జరిగిన జూన్ 2న ప్రతీ ఏటా ఆ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకోవటం కొనసాగిస్తోంది.   


కానీ ఏపీలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర విభజ జరిగిన రోజు జూన్ 2 నుండి వారం రోజుల పాటు ప్రతీ ఏటా నవ నిర్మాణ దీక్ష పేరుతో కార్యక్రమాలు నిర్వహించారు.ఏపీ విడిపోయింది కాబటటి..తొలుత జరుపుకున్న అక్టోబర్ 1న ఏపీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నిర్వహించాలని అనేక ప్రజా సంఘాలు అప్పటి ప్రభుత్వానికి వినతులు చేసాయి. దీంతో కొత్త రాష్ట్రంలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తేదీ అంటే జూన్ 8న రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపకుంటామని నాటి టీడీపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ కేంద్రం ఈ అభిప్రాయంతో విభేదించింది. ఇక..ఆ ప్రతిపాదన అలాగే పెండింగ్ పడిపోయింది.

దీనిపై కొద్ది రోజుల క్రితం ఏపీలో ప్రజా సంఘాలు మళ్ళి సమావేవమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం తెలంగాణతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్ జరుపుకున్న విధంగా అక్టోబర్ 1న నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్ ను కోరారు.  ఇక..అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్ ఇదే అంశం మీద కొందరు ప్రముఖులతో చర్చించారు. దీని పైన ప్రజల్లో చర్చ జరిగే విధంగా ప్రభుత్వం త్వరలోనే తమ నిర్ణయాన్ని బయట పెట్టాలని భావిస్తోంది.ముఖ్యమంత్రి జగన్ సైతం నవంబర్ 1న ఏపీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే తుది నిర్ణయం తీసుకోలేదు.

ఏపీ నుండి తెలంగాణ జిల్లాలు విడిపోయినా..అదే ఆంధ్రప్రదేశ్ పేరుతో రాష్ట్రం కొనసాగుతుందని..త్వరలోనే ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా చేస్తున్న పరిస్థితుల్లో ఏపీ అవతరణ దినోత్సవం మార్చుకోవాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో.. ఈ నెల 16న జరిగే రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో చర్చించి తుది ఆమోదం తెలపనున్నారు. అయిదేళ్లుగా రాష్ట్రంలో జరపకుండా వదిలేసిన రాష్ట్ర అవతరణ దినోత్సవం విషయంలో ఇక ఆ విధంగా జరగటానికి వీళ్లేదని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో..ఏపీ ఆవిర్భావ దినోత్సవం చేసుకోరా అనే ప్రశ్నకు సమాధానం రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: