వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత నాయకుల మీద, పార్టీ మీద కంటే ప్రజలకు ఇచ్చిన హామీల మీదనే ఎక్కువ దృష్టిపెట్టారు.  ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు జగన్ కృషి చేస్తున్నారు.  ఇచ్చిన హామీల్లో చాల వరకు నెరవేర్చారు.  విద్యా, ఉపాధి, పింఛన్ వంటివాటిపై ఇప్పటికే అమలు చేశారు.  నాలుగు నెలలోనే నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించి శభాష్ అనిపించుకున్న జగన్, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిఅందరిచూపులు జగంవైపుకు తిప్పుకునేలా చూసుకున్నారు.  


అయన నిర్ణయాన్ని ఊహాతీతం.. అందరికి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతున్నారు.  మరోవైపు వాహన మిత్ర పేరిట ఆటో డ్రైవర్లకు పదివేల రూపాయలు డబ్బు అందిస్తున్నారు.  అలానే ఈనెల 15 వ తేదీ నుంచి రైతు భరోసా పధకం అమలు చేయబోతున్నారు.  ఈ పధకాలను అమలు చేస్తున్న జగన్ ఇప్పుడు పార్టీపై కొంత దృష్టి పెట్టారు.  


ఇతర పార్టీల్లోనుంచి నేతలను వైకాపాలో చేర్చుకోవడానికి సిద్ధం అయ్యారు.  ఈరోజు జూపూడి ప్రభాకర్ రావు, ఆకుల సత్యన్నారాయణలు వైకాపాలో జాయిన్ అయ్యారు.  తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల నుంచి ఇంకా కొంతమంది నేతలు వైకాపాలో జాయిన్ కావటానికి సిద్ధంగా ఉన్నారు.  అయితే, పార్టీలో జాయిన్ కావాలి అంటే.. అవతల పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాలని చెప్పిన సంగతి తెలిసిందే.  అందుకే ప్రస్తుతం ఎమ్మెల్యేగా పదవుల్లో ఉన్న వ్యక్తులు పార్టీ మారేందుకు సంకోచిస్తున్నారు.  


ప్రస్తుతానికి మాజీలను పార్టీలో చేర్చుకునే కార్యక్రమం జరుగుతున్నది.  మొన్నటి వరకు వైకాపా పార్టీ డోర్స్ క్లోజ్ చేసున్నాయి.  పార్టీలోకి నేతలను ఆహ్వానించేందుకు జగన్ పెద్దగా ఆసక్తి చూపలేదు.  అందుకే చాలామంది నేతలు బీజేపీ వైపు చూశారు.  బీజేపీలో జాయిన్ అయ్యారు.  ఇప్పటికి చాలామంది జాయిన్ కావడానికి సిద్ధం అవుతున్న తరుణంలో జగన్ పార్టీ డోరు తరుపులను వారగా తెరిచారు.  దీంతో ఒక్కొక్కరుగా లోనికి వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు.  ఇక టీడీపీ, జనసేన నుంచి ఎంతమంది నేతలు జంప్ అవుతారో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: