గత ఎన్నికలు రెండు ప్రధాన పార్టీల మధ్య జరిగితే ఈసారి రాష్ట్రం మొత్తం దృష్టిని ఆకర్షించిన హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో బహుముఖ పోరు కనిపిస్తోంది. బీజేపీ, టీడీపీతో పాటు ఒకరిద్దరు స్వతంత్ర అభ్యర్థులు చీల్చే ఓట్లే ఎవరికి నష్టం చేస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా అన్ని పార్టీలు తమ ప్రచార కార్యక్రమాలు నిర్యవహిస్తున్నారు. గతంలో జరిగిన మూడు ఎన్నికల్లోనూ ఓటమి పాలయినా ఈసారి  గెలుపు కోసం టీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. పార్టీ ఇంచార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, స్థానిక మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సామాజిక వర్గాల వారీగా విభజించుకుని మరీ గ్రామాలను చుట్టివస్తూన్నారు.


 కాంగ్రెస్‌ పార్టీ కూడా నామినేషన్ల చివరి రోజున భారీ సభనే నిర్వహించింది.  పార్టీ అతిరథ మహారథులు హాజరైన ఈ సభతో పార్టీ నేతల్లో ఐక్యత వచి్చందనే అభిప్రాయంతో కేడర్‌ ఉరకలు పెడుతోంది.బీజేపీ కూడా మండలాల వారీగా పార్టీ ఇన్‌చార్జులను నియమించి వీలునన్ని ఎక్కువ ఓట్లు రాబట్టుకునేలా ప్రయతి్నస్తోంది. టీడీపీ కూడా తన ఓటు బ్యాంకును రక్షించుకునే ప్రయత్నంలో ప్రచారం నిర్వహిస్తోంది. స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.


 జీ హుజూరా? జై హుజూర్‌నగరా? అంటూ కేటీఆర్‌ చేసిన ఈ కామెంట్‌ను టీఆర్‌ఎస్‌తో పాటు అన్ని పారీ్టలు తమకు అనుకూలంగా మలుచుకుంటూ ప్రచారం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా రోడ్‌ రోలర్, ట్రాక్టర్‌ నడిపే రైతు గుర్తులు కారు గుర్తును గందరగోళం చేస్తాయనే అభిప్రాయం వినిపిస్తోంది.


ఈ నేపథ్యంలో ఇతర పారీ్టల అభ్యర్థులు, స్వతంత్రులు, ఎన్నికల గుర్తులు అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ఎవరికి మేలు చేస్తాయి... ఎవరికి నష్టం చేస్తాయన్నది ఆసక్తిని కలిగిస్తోంది. కాగా, ప్రధాన పారీ్టలు ఎప్పటికప్పుడు తమ పరిస్థితిపై సర్వేలు, నివేదికలు తెప్పించుకోవడం ప్రారంభించాయి. మొత్తం మీద హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో ఉప ఎన్నిక కారణంగా దసరా తర్వాత కూడా మరో 15 రోజుల పాటు పండుగ వాతావరణమే కనిపించనుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: