ఈ మధ్య కాలంలో ఆన్ లైన్ లో యాప్స్ ద్వారా హోటల్ బుకింగ్ చేసుకోవటం సాధారణం అయింది. కొత్త ప్రదేశాలకు వెళ్లే సమయంలో ఆ ప్రాంతంలోని హోటళ్లు, హోటళ్ల రేంజ్ వంటి విషయాలు యాప్స్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. కానీ కొందరు కస్టమర్లకు హోటల్ బుక్ చేసుకున్న తరువాత చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. ఇండియాలో బాగా ప్రాముఖ్యత పొందిన యాప్ ద్వారా కొంతమంది ఒక హోటల్ బుక్ చేసుకున్నారు. 
 
హోటల్ కోసం ముందుగానే ఆన్ లైన్ లో డబ్బులు కూడా చెల్లించేశారు. గూగుల్ మ్యాప్ ద్వారా హోటల్ లొకేషన్ చూపిస్తున్న అడ్రస్ కు వెళితే అక్కడ వారికి ఏ హోటల్ కనిపించలేదు. ఆ తరువాత ఆ ప్రాంతం వారిని హోటల్ గురించి ఎంక్వైరీ చేస్తే అక్కడ అలాంటి పేరు గల హోటల్ లేదని చెప్పటంతో షాక్ అవటం అక్కడకు వెళ్లిన వారి వంతు అయింది. బ్రిటన్ దేశంలోని ఇబిజా ప్రాంతంలో కూడా ఒక జంటకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. 
 
ఒక వెబ్ సైట్ లో మంచి రివ్యూలు ఉండటం చూసిన ఆ జంట సెలవులు సరదాగా గడపాలనే ఆలోచనతో వీఐపీ పెంట్ హౌస్ బుక్ చేసుకుంది. వీఐపీ పెంట్ హౌస్ కోసం దాదాపు 8 లక్షల రూపాయలు చెల్లించింది. ఆ తరువాత హోటల్ కు వెళ్లగా ఆ హోటల్ లో వీఐపీ పెంట్ హౌస్ లేదని హోటల్ వాళ్లు చెప్పారు. బుకింగ్ చేసుకున్న వెబ్ సైట్ కంపెనీకి ఫోన్ చేసి రిఫండ్ ఇవ్వమని కోరగా హోటల్లో రూమ్ ఇవ్వమని చెబితే మాత్రమే రిఫండ్ ఇస్తామని కస్టమర్ కేర్ ఎగిక్యూటివ్ ఆ జంటతో చెప్పాడు. 
 
ఆ తరువాత వెబ్ సైట్ కంపెనీ నిర్వాహకులకు పెంట్ హౌస్ యాడ్ ఫేక్ అని తెలిసింది. ప్రస్తుతం ఈ సమస్యను పరిష్కరించామని వెబ్ సైట్ నిర్వాహకులు చెబుతున్నారు. కొంతమంది డబ్బుల కోసం వారికి హోటల్ లేకపోయినా ఆన్ లైన్ లో అందంగా ఉండే హోటళ్ల ఫోటోలను పెట్టి అటు సర్వీసులు అందించే సంస్థలను, ఇటు కస్టమర్లను మోసం చేస్తున్నారు. అందువలన ఎవరైనా హోటళ్లు బుకింగ్ చేసుకునే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: