సీఎం కేసీయార్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో కలెక్టర్ల సమావేశం జరుగుతోంది. సీఎం కేసీయార్ గ్రామాల్లో 30 రోజుల ప్రణాళిక వివరాల గురించి కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ సమ్మె గురించి కూడా కలెక్టర్లతో కేసీయార్ చర్చలు జరిపారు. ప్రయాణికుల తిరుగు ప్రయాణం దృష్టిలో పెట్టుకుని కేసీయార్ కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో శాంతి భద్రతలపై కలెక్టర్లు దృష్టి పెట్టాలని, ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం కఠినంగా ఉందని కేసీయార్ అన్నారు. 
 
సమావేశంలో మొదట కేసీయార్ 30 రోజుల ప్రణాళిక గురించి రివ్యూ జరిపారని తెలుస్తోంది. ప్రభుత్వం 30 రోజుల ప్రణాళిక కార్యక్రమాన్ని కేసీయార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. కలెక్టర్లు, డీఈవోలు, డీపీఎల్వోలు ఈ సమావేశానికి హాజరు అయ్యారు. మరోవైపు హైకోర్టులో ఆర్టీసీకి సంబంధించిన వాదనలు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. హైకోర్టుకు జేఏసీ నేతలు హాజరు అయ్యారని సమాచారం. 
 
హైకోర్టుకు సంబంధించి నిర్ణయం వెలువడిన తరువాత సీఎం కేసీయార్ ఆర్టీసీకి సంబంధించిన ప్రకటన కూడా చేసే అవకాశం ఐతే ఉందని తెలుస్తోంది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ కు హైకోర్టు స్పందన ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఆర్టీసీ సమ్మె ప్రభావం గురించి మరియు ఆర్టీసీ వాహనాలు ఎన్ని తిరుగుతున్నాయనే అంశం గురించి కూడా కేసీయార్ కలెక్టర్లతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 
 
సమ్మె చట్టబద్ధం కాదని ప్రభుత్వం మరోవైపు తమ డిమాండ్ల సాధన కోసం మాత్రమే సమ్మె అని కార్మికులు చెబుతున్న నేపథ్యంలో న్యాయస్థానం ఇచ్చే తీర్పు ఈరోజు కీలకంగా మారనుంది. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆర్టీసీ జేఏసీ అఖిల పక్ష సమావేశం సుందరయ్య విజ్ఞాన వేదికలో నిర్వహించనుంది. ఆ తరువాత తెలంగాణ బంద్ గురించి గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ను ఆర్టీసీ జేఏసీ కలవబోతుంది. 
 
 
 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: