ఈ మధ్య హైదరాబాద్ లో జరుగుటున్న బస్సుల సమ్మెతో తెలంగాణ ప్రభుత్వం మీద కొంత అసహనం వచ్చిన సంగతి తెలిసిందే ఇది ఇలా ఉంటే మరో వైపు హుజూర్ నగర్ ఎన్నికల నేపధ్యానికి ఈ సమ్మె ఏమైనా ఎఫెక్ట్  ఇవ్వనుందా అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. 

తెలంగాణా రాష్ట్రంలో  సీపీఐ తాజా పరిణామాల నేపధ్యంలో అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్న సీపీఐ యూ టర్న్ తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది . హుజూర్ నగర్ ఎన్నికల్లో అధికార పార్టీకి తమ మద్దతు ప్రకటించిన సీపీఐ నేతలు ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపధ్యంలో ఆత్మ పరిశీలనలో పడ్డారు. అందుకే ఇప్పటికైనా కార్మికుల సమస్యల పట్ల సానుకూలంగా ఉండాలని లేని యెడల అధికార పార్టీకి మద్దతుపై పునరాలోచిస్తామని సంకేతాలిస్తున్నారు. మొదటి నుండి కార్మిక పక్షపాతిగా ఉన్న సీపీఐ నేతలు ఆర్టీసీ కార్మికులకు తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు. ఇక హుజూర్ నగర్ ఎన్నికల్లో మద్దతు రాజకీయ అవసరం అని ముందు పేర్కొన్నప్పటికీ ఇప్పుడు మాత్రం ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపధ్యంలో యూటర్న్ తీసుకునే ఆలోచనలో ఉన్నారు.

ఇలా అందరిలో ఇలాంటి ఆలోచనలే వస్తే ఎంతో కష్టపడి తయారు చేసుకున్న తెలంగాణలో K.C.R గారు వచ్చే ఎలక్షన్ లో ఒడిపోయ్యే అవకాశం కూడా ఉంది అనే అనుమానాలు తెలంగాణలో ఉన్న ప్రతోక్క రాజకీయ నాయకుల అంతర్లీన భావన.

ఇది ఇలా ఉంటే వచ్చిన ఈ చిన్ని అవకాశాన్ని ప్రతొక్క కే.సీ.ఆర్ విరుద్ధ పార్టీలు రెచ్చిపోతున్నారు.

ఇటు పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ తరపున ఘాటుగా స్పందించడంతో ఇప్పుడు ఈ సమ్మె అనే అంశం ఏ రేంజ్ లో వెళ్లనుందో, ఎంత దూరం వెళ్లనుందో అని ప్రతొక్కరిలో కూడా ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న తెలంగాణ ఇప్పుడు ఆర్.టీ. సి కార్మికుల సమ్మెను,వాళ్ళ కష్టాలను ఎలా తీర్చనుందో వేచి చూద్దాం...

 

మరింత సమాచారం తెలుసుకోండి: