దేశంలో ప్రవహించే ముఖ్యమైన జీవ నదుల్లో గంగానది ఒకటి.  గంగానది హిమాలయాల్లో పుట్టి హిమాలయాల నుంచి మూడు పాయలుగా చీలి హరిద్వార్ లోని ప్రయాగలో తిరిగి ఒక్కటిగా కలిసి గంగానదిగా కిందికి ప్రవహిస్తుంది.  దేశంలో  అత్యంత పురాతనమైన, పవిత్రమైన నదుల్లో ఇది ఒకటి. ఈ నదీపరీవాహ  ప్రాంతాల్లో అనేక పరిశ్రమలను  ఏర్పాటు చేయడంతో గంగానది కలుషితం అవుతున్నది.  


గంగానది ప్రక్షాళన కోసం ఒక శాఖను ఏర్పాటు చేసి ప్రక్షాళన చేస్తున్నా... ఇంకా కలుషితం అవుతూనే ఉన్నది.  వారణాసిలోని గంగానదిలో శవాలను విసిరివేయడంతో కొంతమేర ఇబ్బందులు వస్తుంటాయి.  ఇక గంగానది ప్రక్షాళన కోసం ప్రొఫెసర్ జెడి అగర్వాల్ దాదాపు 115 రోజులపాటు నిరాహార దీక్ష చేసి ప్రాణాలు విడిచాడు.  గంగా ప్రక్షాళన కోసం జెడి అగర్వాల్ ప్రాణాలు విడిచిన సమయంలో పవన్ కళ్యాణ్ పోరాట యాత్రలో ఉన్నారు.  కాగా, జెడి అగర్వాల్ మరణించిన రోజున హరిద్వార్ కు వెళ్లలేకపోయారు.  


అయితే, నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ హరిద్వార్ వెళ్లారు.  జెడి అగర్వాల్ మొదటి వర్ధంతి సందర్భంగా హరిద్వార్ లోని మాత్రి సదన్ ఆశ్రమంలో ఉన్న అయన సమాధిని సందర్శించి అంజలి ఘటించారు.  గంగ ప్రక్షాళన కోసం ఉత్తరాదిన పోరాటం చేస్తున్నామని వాటర్ మ్యాన్ అఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్న రాజేంద్రసింగ్ పేర్కొన్నారు.  కానీ, తమకు దక్షిణాది నుంచి మద్దతు లభించడం లేదని, జెడి అగర్వాల్ లో ఉన్న స్ఫూర్తి మళ్ళీ పవన్ కళ్యాణ్ లో చూస్తున్నామని, పవన్ గంగ ప్రక్షాళనకు మద్దతు ఇవ్వాలని కోరారు.  


దేశంలోని అన్ని నదులను కాపాడుకోవడం చాలా అవసరం అని, గంగా ప్రక్షాళనకు తన వాంతుగ్గా పోరాటం చేస్తానని చెప్పారు.  పవిత్రమైన గంగానదిని కాపాడుకోవడమే ప్రతి ఒక్కరి లక్ష్యం అని పవన్ పేర్కొన్నారు. జెడి అగర్వాల్ స్పూర్తితో పనిచేస్తానని పవన్ ఈ సందర్భంగా తెలియజేశారు.  జెడి అగర్వాల్ వర్ధంతి కార్యక్రమంలో రాజేంద్రసింగ్, ఆశ్రమ గురూజీ శివానంద మహారాజ్ తదితరులు పాల్గొన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: