2004 వ సంవత్సరం నుంచి 2009 వరకు ఆంధ్రప్రదేశ్ కు సువర్ణయుగం అని చెప్పాలి.  2004 లో వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చారు.  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్ అంతకు ముందు రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టారు.  ఈ యాత్రలో ప్రజల సమస్యల గురించి తెలుసుకున్నారు.  ప్రజలు పడుతున్న కష్టాలను కళ్లారా చూశారు.  విద్యా, ఆరోగ్యం కోసం పడుతున్న ఇబ్బందులను గమనించారు.  


అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్ మొదట వీటిపైనే దృష్టి పెట్టారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని పేర్కొన్నారు.  ఫీజు రీయింబర్స్మెంట్ పధకం ద్వారా విద్యార్థులు ఉన్నత విద్య చదువుకోవడానికి అవకాశం దొరికింది. కార్పొరేట్ కాలేజీల్లో చదువుకునేందుకు అవకాశం దొరకడంతో విద్యార్థులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.  చదువును మధ్యలో ఆపేయకూడాదని చెప్పి వైఎస్ ఈ నిర్ణయం తీసుకున్నారు.  


ఈ పధకాన్ని ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి.  పిల్లలకు నాణ్యమైన చదువును అందిస్తున్నాయి.  దీంతో పాటు పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో ఆరోగ్యశ్రీ పధకాన్ని తీసుకొచ్చారు. ఇది పేద ప్రజలకు బాగా ఉపయోగపడింది.  పేద ప్రజలకు ఈ పధకం ద్వారా లబ్ది చేకూరింది.  ఫలితంగా వైఎస్ఆర్ ప్రజలకు దేవుడయ్యాడు.  ఇదే పధకాన్ని ఇప్పటికి ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి.  ఇదిలా ఉంటె, జగన్ మరో అడుగు ముందుకు వేసి ప్రజలకు ఉపయోగపడే అనేక పధకాలు ప్రవేశపెట్టారు.  


ముఖ్యంగా పింఛన్ ను పెంచారు.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా దాదాపు 50వేలమంది ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోయారు.  అలానే, గ్రామాల్లోనే పరిపాలన వ్యవస్థ ఉండాలని గ్రామ వాలంటీర్లను నియమించారు.  గ్రామ సచివాలయ ఉద్యోగాలను కల్పించారు.  నాలుగు నెలల్లోనే నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పోనుంచి శభాష్ అనిపించుకున్నారు.  ప్రజల గుండెల్లో జననేతగా నిలిచిపోయారు.  నాలుగు నెలల కాలంలోనే ఇన్ని చేస్తే.. జగన్ ఐదేళ్ళలో ఇంకెన్ని చేస్తారో అని ఎదురు చూస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: