మద్యం మనిషి చిత్తు చేస్తుంది.. అందులో సందేహం అవసరం లేదు.  మద్యం మత్తులో మనిషి ఎలా మారిపోతాడో చెప్పక్కర్లేదు.  ఒక్కసారి మద్యానికి బానిసైతే.. అతని మానసిక పరిస్థితి దారుణంగా మారిపోతుంది.  చేతిలో డబ్బులున్నా లేకున్నా సరే మద్యం కోసం పరుగులు తీస్తుంటాడు.  ఎలాగైనా మద్యం తాగాలని తాపత్రయ పడుతుంటాడు.  ఆ తాపత్రయంతోనే తప్పులు చేస్తుంటాడు.  


మద్యం ఎందుకు తీసుకుంటున్నారో ఆడితే.. వాళ్ళు చెప్పే సమాధానాలు భలే విచిత్రంగా ఉంటాయి.. బాధను మర్చిపోవడానికి తీసుకుంటానని, నిద్రపోవడం తీసుకుంటానని అంటుంటారు.  మద్యానికి బానిసలు అయ్యామని మాత్రం చెప్పరు.  ఇదిలా ఉంటె, కేవలం మనుషులకే కాదు కొన్ని రకాల జంతువులకు కూడా మద్యం అలవాటు అలవాటు అవుతుంది.  మద్యాన్ని కావాలని వాళ్లకు అలవాటు చేస్తుంటారు.  అలా అలవాటు చేయడం వలన ఇబ్బందులు పడుతుంటారు.  


గతంలో కోడి, మేకకు మద్యం అలవాటు చేయడం వలన అవి చేసిన హంగామా గురించి అందరికి తెలిసిందే.  అయితే, ఇప్పుడు మొసలికి మద్యం అలవాటు చేశారు.  ఆ మద్యం మత్తులో అది దాన్ని పెంచుతున్న వ్యక్తి చేతిని గాయపరిచింది. ఈ సంఘటన వీడియోగా బయటకు రావడంతో వైరల్ అయ్యింది.  ఈ సంఘటన ఫ్లోరిడా లో చోటు చేసుకుంది.  


ఫ్లోరిడా కు చెందిన  టిమొతీ కెప్కే  అనే యువకుడు తన ఫ్రెండ్ తో కలిసి ఓ మొసలిని ఇంటికి తీసుకొచ్చాడు.  దాన్ని పెంపుడు జంతువులా పెంచుకోవడం మొదలుపెట్టారు.  అయితే, దానికి బీరుపోసి పెంచుతుండటంతో.. అది ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం మొదలుపెట్టింది.  ఆ మత్తులో టిమొతీ కెప్కే చేతిపై గాయం చేసింది.  మొసలితో ఆటలాడుతూ వీడియో తీసిన సమయంలో ఆ గాయం అయ్యింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  అది వైరల్ కావడంతో పోలీసులు టిమొతీ కెప్కే ను అరెస్ట్ చేశారు. 

ఆగష్టు 26 వ తేదీన మొసలి తమకు దొరికిందని ఇంటికి తీసుకొచ్చినట్టు టిమొతీ కెప్కే పేర్కొన్నాడు. దానికి బీరుపోసి పెంచినట్టు ఒప్పుకోవడంతో టిమొతీ కెప్కే ను పోలీసులు అరెస్ట్ చేశారు.  మాములుగా మొసళ్లను ఇంట్లో పెంచుకోవడం నేరం.  అన్ని జంతువుల్లా అవి చెలిమి కావు. నీళ్లలో ఉన్నప్పుడు ఎంత డేంజర్ గా ఉంటాయో.. నీళ్లలో ఉన్నప్పుడు కూడా అలానే ఉంటాయి.  పాములైనా జాగ్రత్తగా పెంచితే పెంపుడు జంతువుల్లా మారొచ్చేమోగాని, మొసళ్ళు మాత్రం మారవు.  


మరింత సమాచారం తెలుసుకోండి: