మహాబలిపురంలోని షోర్ ఆలయాన్ని జింపింగ్‌కు పరిచయం చేశారు ప్రధాని మోదీ. ఇద్దరు కలిసి యునెస్కో వారసత్వ సంపదైన మహాబలిపురం ఆలయం ప్రాంగణంలో తిరుగుతూ మాట్లాడుకున్నారు. ప్రధాని మోదీ పంచె కట్టులో కొత్తగా మెరిశారు. ఎప్పుడూ కుర్తా, పైజామా, హాఫ్ స్లీవ్ జాకెట్‌లో కనిపించే ప్రధాని మహాబలిపురం పర్యటనలో మాత్రం తమిళ సంప్రదాయంలో పంచె కట్టుకొని కనిపించారు. ఇక చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా షర్ట్, ప్యాంట్‌తో చాలా సింపుల్‌గా ఉన్నారు. భారత పర్యటనకు వచ్చిన జిన్‌పింగ్‌కు ఘనస్వాగతం పలికారు ప్రధాని మోదీ. 


తర్వాత మహాబలిపురంలోని షోర్ ఆలయాన్ని జింపింగ్‌కు పరిచయం చేశారు. ఇద్దరు కలిసి యునెస్కో వారసత్వ సంపదైన మహాబలిపురం ఆలయం ప్రాంగణంలో తిరుగుతూ మాట్లాడుకున్నారు. ఆలయ విశిష్టత గురించి జిన్‌పింగ్‌కు వివరించారు మోదీ. గతంలోనూ తమిళనాడులో పర్యటించిన సందర్భంగా పంచె కట్టుకున్నారు మోదీ. తమిళ్ సూపర్ స్టార్ రజనికాంత్‌ను కలిసినప్పుడు పంచె ధరించారు.


మహాబలిపురంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పంచె కట్టులో మెరిసిన మోదీ.. జిన్‌పింగ్‌ను యునెస్కో వారసత్వ ప్రాంతమైన శోర్ ఆలయానికి తీసుకెళ్లారు. ఆలయ ప్రాంగణంలో కలియ తిరుగుతూ మహాబలిపురం చరిత్రను ఆయనకు వివరించారు. భారత పర్యటనకు వచ్చిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు తమిళనాడులోని మహాబలిపురంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు.


ఈ సందర్భంగా మోదీ తమిళ సంప్రదాయ వస్త్రధారణ పంచెకట్టులో కనిపించారు. తెల్లని పంచె, చొక్కా ధరించిన ఆయన జిన్‌పింగ్‌తో కలిసి అక్కడి చారిత్రక కట్టడాలను సందర్శించి ఆలయ విశిష్ట తెలియచేసారు.వెయ్యేళ్ల కిందట పల్లవ రాజులు మహాబలిపురంలో నిర్మించిన ఆ కట్టడాల వైశిష్ట్యాన్ని జిన్‌పింగ్‌కు మోదీ వివరించారు.తొలుత జిన్‌పింగ్ చెన్నై అంతర్జాతీయ విమానశ్రయానికి చేరుకోగా తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌, ముఖ్యమంత్రి పళనిస్వామి స్వాగతం పలికారు. తన రాక సందర్భంగా విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలను తిలకిస్తూ జిన్‌పింగ్ బయటకొచ్చారు. అనంతరం సాయంత్రం మహాబలిపురం చేరుకున్నారు. మామళ్లపురంలో అర్జునుడు తపస్సు చేసిన ప్రాంతంగా చెప్పేచోట, ప్రాచీన పంచరథ సముదాయంలో మోదీ, జిన్‌పింగ్‌లు తిరిగారని ప్రధాని కార్యాలయం ఒక ట్వీట్‌లో తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: