భారతీయ రైల్వేను ప్రైవేటు పరం చేసేందుకు అడుగులు వేస్తున్న కేంద్రం ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తొలి విడతలో భాగంగా 150 రైళ్లు, 50 రైల్వే స్టేషన్ల నిర్వహణ బాధ్యత ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది.

 

భారతీయ రైల్వేను ప్రైవేటు పరం చేసేందుకు అడుగులు వేస్తున్న కేంద్రం ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తొలి విడతలో భాగంగా 150 రైళ్లు, 50 రైల్వే స్టేషన్ల నిర్వహణ బాధ్యత ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనుంది.

 

ఈ విషయమై నీతిఆయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్ లేఖ రాశారని రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ తెలిపారు. కమిటీలో వీకే యాదవ్, అమితాబ్‌లతోపాటు ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి, గృహ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఉంటారు. రైల్వే బోర్డు ఇంజనీరింగ్‌ సభ్యుడు, ట్రాఫిక్‌ రైల్వే బోర్డు సభ్యుడిని కూడా ఈ సాధికారిక యంత్రాంగంలో భాగం చేయాలని అమితాబ్‌ కాంత్‌ తెలిపారు.

 

దేశవ్యాప్తంగా 400 రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. ఈ నేపథ్యంలో తొలి విడతలో 50 రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు. కాగా, ఈ నెల 4న లఖ్‌నవూ-ఢిల్లీ మధ్య ప్రారంభమైన తేజస్ ఎక్స్‌ప్రెస్ దేశంలో తొలి ప్రైవేటు రైలు అన్న విషయం తెలిసిందే.

 

ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో ఇది నడుస్తుండగా.. భోజన సదుపాయం, రూ.25 లక్షల దాకా ఉచిత బీమా సదుపాయం, ఆలస్యమైతే పరిహారం చెల్లింపు లాంటి పలు సదుపాయాలను ఇందులో కల్పిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: